2019 అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నేత తొగురు ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు కాకుండా డాక్టర్ సుధీర్‌ను వైసీపీ బరిలోకి దింపింది. అప్పటి నుంచి వైసీపీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వెయ్యాలని నందికొట్కూరులో సుధీర్ ప్రచారం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలు మారుతాయి అంటూ టీడీపీ నేత జయసూర్య ప్రచారాలు కొనసాగించారు. ప్రజలు చివరికి ఎవరిని నమ్మారు?
* 2024 ఎలక్షన్ రిజల్ట్
చాలా హోరాహోరీగా సాగిన 27 రౌండ్లో టీడీపీ కూటమి నేత గిత్తా జయసూర్య 9,792 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈయన 92,004 ఓట్లు గెలుచుకోగా.. దారా సుధీర్ 82,212 ఓట్లకు పరిమితమయ్యారు. ఈసారి టీడీపీ కూటమి సునామీలో సీనియర్ నేతలు బలమైన నేతలు అందరూ కూడా ఓడిపోయారు. చాలామంది కొన్ని వేల ఓట్లతో ఓడిపోగా మిగతాచోట్ల మాత్రం భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. జగన్ ఈసారి 59 వేల కోట్ల మెజార్టీతో గెలవగా గెలిచిన మిగతా వారందరూ తక్కువ మెజార్టీతోనే సరిపెట్టుకున్నారు.
నందికొట్కూరులో కొత్తపల్లె, జూపాడు బంగ్లా, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, మిడుతూరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 216,867. అయితే ఇందులో దాదాపు సగం ఓట్లు టీడీపీ నేతకే పడిపోయాయి. మరి ఏపీ ప్రజలు కోరుకున్నట్లు వారిని సంతృప్తి పరిచే లాగా టీడీపీ కూటమి ఎలా పరిపాలన అందిస్తుందో చూడాలి. ఇష్టానికి చంద్రబాబు చాలానే హామీలను ఇచ్చారు, వాటన్నిటినీ అమలు చేయడానికి ఖజానా సరిపోతుందా లేదా అనేదానిపై ఇప్పుడు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి