కాలం మారుతోంది... రాజకీయాల్లోకి విద్యావంతులు, మేధావులు రావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశ భవిష్యత్తును మార్చేది యువతే. అవును, రాజకీయ నాయకుల భవిష్యత్తును మార్చేది కూడా యువ ఓటర్లే. ఈమాటను నిజం చేసి చుపిస్తామంటున్నారు కరీంనగర్ కొత్త ఓటర్స్. తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన కరీంనగర్ యువత చాలా ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఉచిత పథకాలు పెట్టి ఓటర్స్ ను సోమరి పోతులుగా చేస్తున్నారని వాపోయారు. ముఖ్యంగా యువత మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను ఒక మంచి మేధావి చేతిలో పెడితే భవిష్యత్ తరాలకు చాలా అభివృద్ధి జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈసారి పార్లమెంటు ఎలక్షన్స్ లో దాదాపు 80 లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కలిగింది. ఈ 80 లక్షల ఓట్లు రాబోయే 5 సంవత్సరాలలో ఒక మంచి పాలన అందించబోయే నాయకులకే ఓటు వేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆలోచించేది రోడ్లు, లైట్లు, వేయడం కాదు. చదువుకున్న వారికి ఇంటికో జాబ్, యువతకు కావాలిసిన కార్పొరేట్ విద్య, వైద్యం, ఇస్తే భారతదేశాన్ని అభివృద్ధి చేసినవారు అవుతారని అభిప్రాయపడుతున్నారు. విద్యావంతులు కూడా ఈసారి అలోచించి ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే విధంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ తమ ఊళ్లకు వెళ్లి తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

అదే సమయంలో పల్లె, పట్టణాల్లో నివసిస్తున్న సాధారణ జనాలు కూడా తమకోసం కాకుండా తమ పిల్లల భవిష్యత్తు కోసం అలోచించి సరియైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఓటుకి నోటు, మందు సీసాలు తీసుకొని ఓట్లు వేస్తే భవిష్యత్తు తరాలకి చిల్లులు పడతాయని అంటున్నారు. అక్కడితో ఆగకుండా దౌర్జన్యం, దోపిడీలు ఎక్కువై ఆఖరికి మానవత్వం మంటగలిసి పోయే స్థాయికి వచ్చేస్తారని అంటున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో 79.74 శాతం మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోగలిగారు. కాగా ఈసారి మాత్రం ఆ సంఖ్య పెరిగే సూచనలు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: