ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా పోలింగ్ హడావిడి కనిపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా ప్రచారంతో దూసుకుపోయారు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపించింది. అయితే ఇలా ఎన్నికల్లో హామీలు ఇచ్చిన అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చేందుకు నేడు తెలంగాణ ఓటర్లు అందరూ కూడా సిద్ధమయ్యారు. అయితే 17 అసెంబ్లీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక  పోలింగ్ కూడా నేడే జరుగుతూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. దీంతో ఇక కొన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ మందకోడిగానే సాగుతుంది. అయితే బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసిఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కూడా ఇక తమ సొంత ప్రాంతాలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. గులాబీ దళపతి కేసీఆర్ సతి సమేతంగా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.



 ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ దంపతులు చింతమడకకు వెళ్తారు. అక్కడ ఓటు వేయబోతున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో సతీసమేతంగా ఓటు వేయబోతున్నారు అని చెప్పాలి  ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లబోతున్నారు  పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలానికి వెళ్లబోతున్న సీఎం రేవంత్   అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాదు రెండు రోజులపాటు సతీసమేతంగా అక్కడే ఉంటారు అన్నది తెలుస్తుంది. మొన్నటి వరకు ఇక తమ పార్టీ అభ్యర్థులు అందరి తరపున కూడా ప్రచార నిర్వహించి ఇక నిలకడ లేకుండా బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి కేసీఆర్ లు ఇక మరి కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr