నిన్నటితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక పోతే ఎలక్షన్ లకి చాలా రోజుల ముందు నుండే గుంటూరు లో టీడీపీ పార్టీ అదిరిపోయే రేంజ్ లో సీట్ లను సాధిస్తుంది అని అనేక మంది అంచనా వేశారు. దానికి ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కోసం ఎంతో మంది ఎన్నో ప్రతిపాదనలు వేసిన అవన్నీ కాదని చెప్పి చంద్రబాబు మాత్రం కృష్ణ , గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అమరావతి ని రాజధానిగా ఎంచుకున్నారు.

అందులో భాగంగా కొన్ని భవనాలను కూడా నిర్మించారు. ఇక 2019 సంవత్సరం ఎన్నికలలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి ఒకటి మాత్రమే కాకుండా మరో రెండు నగరాలను కలిపి మూడు రాజధానులను చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఒక్క సారిగా కృష్ణ , గుంటూరు జిల్లా వాసులు వైసీపీ పై సీరియస్ అయ్యారు.

దానితో వైసీపీ కి 2024 అసెంబ్లీ ఎన్నికలలో చాలా తక్కువ సీట్లు ఈ ప్రాంతంలో రాబోతున్నట్లు టీడీపీ హవా ఈ ప్రాంతంలో భారీగా కొనసాగనున్నట్లు ఎలక్షన్ ల ముందు వరకు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఎలక్షన్ లలో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఎలక్షన్ లలో పెద్దగా చూపించలేదు అని , దానితో ఈ సారి కూడా గుంటూరు లో వైసీపీ హవా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే గుంటూరు జిల్లాలో తాడికొండ , ప్రత్తిపాడు , మంగళగిరి , పొన్నూరు , తెనాలి , గుంటూరు  ఈస్ట్ , గుంటూరు వెస్ట్ అని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నుండి ప్రస్తుతం వైసీపీ లో మంత్రి గా పని చేస్తున్న విడుదల రజిని గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తుంది. ఈమె గెలుపు ఫస్ట్ నుండి కూడా కన్ఫామ్ గా కనబడుతుంది. ఇక మరో మూడు , నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గాలివీయనున్నట్లు , రెండు , మూడు ప్రాంతాలలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సారి కూడా గుంటూరు జిల్లాలో జగన్ హవా ఫుల్ జోష్ లో కొనసాగబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: