ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారనే దానిపై అనేక విశేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఓడిపోతే ఏపీ ప్రజల పరిస్థితి ఏమవుతుందో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి జగన్ ఈసారి తన పదవిని నిలబెట్టుకోలేక పోతే ఏపీలో సంక్షేమ పథకాలపై కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒక ఏపీలోనే కాదు సంక్షేమ పథకాలను ఇస్తే అధికారంలోకి కచ్చితంగా వస్తామనే నమ్మకం దేశవ్యాప్తంగా లేకుండా పోతుంది. ఈ కాన్సెప్టు 100% వర్కౌట్ కాదని ఒక భావన నాయకులలో బలపడుతుంది.

అలానే ప్రతి పథకం, పెన్షన్ సంక్షేమ పథకాలను ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఎవరూ అనుకోరు. సర్పంచుల, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ పునరుద్దిస్తారు. ఇది పరిపాలన పరంగా ఏపీలో చేంజ్ అయ్యే పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయపరంగా వైసీపీకి పెద్దగా పోయేదేమీ ఉండదు. జగన్ జైలుకు వెళ్లడం లాంటి ఘటనలు ఏమీ జరగకపోవచ్చు. బాగా ట్రై చేస్తే కొన్ని నెలల వరకు చేరుకు పంపించవచ్చు కానీ అంతకుమించి జగన్‌ను జైల్లో ఉంచలేరు. అంతకంటే చంద్రబాబు జగన్ ను చేసేది ఏమీ లేదు.

 అయితే పార్టీలో అంతర్గతంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టడం జరుగుతుంది. నిజానికి జగన్ ఐదేళ్ల హయాంలో ఏపీకి చాలానే కంపెనీలు వచ్చాయి. వాటి గురించి ప్రచారం చేసుకోవడంలో వైసిపి ఫెయిల్ అయ్యింది. చంద్రబాబు మామూలుగా ఏదైనా కంపెనీ ఏపీలో ప్రారంభమైతే దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. హడావుడి చేస్తారు, ప్రజలందరికీ తెలిసేలాగా మీడియాలో కనిపిస్తారు. జగన్ ఇందులో ఫెయిల్ అయ్యారు. ఒకవేళ ఆయన ఓడిపోతే నెక్స్ట్ టైమ్ వీటి గురించి తప్పకుండా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే అందరి ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ధోరణి కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: