-టీడీపీకి మైనస్ గా మారిన అంతర్గత పోరు.
-బొత్స ఇమేజ్ మరోసారి కలిసి రానుందా.?
- కళా వెంకట్రావు చాప చుట్టాల్సిందేనా.?


రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. ప్రస్తుతం రిజల్ట్ పైనే అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలోనే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారనేది చాలామంది చర్చించుకుంటున్నారు. అలాంటి ఏపీలో అత్యంత కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ లీడర్లు హోరాహోరీగా తలపడుతున్నారు. టిడిపి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉండగా, వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు సీనియర్ లీడర్ల మధ్య ఏర్పడిన బిగ్ ఫైట్ లో గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయి. చీపురుపల్లి ఓటర్లు ఎవరిని ఆదరించారు అనే వివరాలు తెలుసుకుందాం.

 బొత్స వర్సెస్ కళా:
 విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో  బొత్స సత్యనారాయణ గురించి ఎవరికి చెప్పనక్కర్లేదు. ఎంపీగా, పిసిసి చీఫ్ గా, మంత్రిగా ఇలా ఎన్నో పదవులు అలంకరించారు. చీపురుపల్లి నుంచి మూడుసార్లు గెలిచిన ఆయన నాలుగోసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు టిడిపి నుంచి బరిలో దించారు. ఈయన ముందుగా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అన్నారట.కానీ పొత్తులో భాగంగా  బిజెపికి ఆ సీటు వెళ్లిపోయింది. దీంతో కళా వెంకట్రావు చేసేదేమీ లేక చీపురుపల్లికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈయనకు రాజకీయంగా ఈ నియోజకవర్గంలో కొన్ని సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రి కిమిడి  మృణాళిని కుటుంబ సభ్యులేనట.


ఈమెకు వెంకట్రావు బావ అవుతారట. ఇక వైసీపీ నుంచి సమన్వయకర్తగా జడ్పీ చైర్మన్ గా చిన్న శ్రీను ఉన్నారు. ఈయనే చీపురుపల్లి మొత్తం వైసిపి కార్యక్రమాలను సెట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంపీ బెల్లన్న, చిన్న శ్రీను,మంత్రి బొత్స సత్యనారాయణ వీరంతా  కలిసి చీపురుపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. రెండు లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో  మెజారిటీగా ఉండేది కాపులే. అభ్యర్థుల గెలుపోటములు   నిర్దేశించేది కాపులే. ఈ ఇద్దరు నేతలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కుల ప్రస్తావన అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇక కళా వెంకట్రావు కూడా ఆరుసార్లు టిడిపి నుంచి  గెలుపొందారు. హోం శాఖ మంత్రిగా పని చేశారు.

 గెలుపోటములు:
 చీపురుపల్లిలో ఎంతో పట్టు సాధించినటువంటి  బొత్స సత్యనారాయణకు దాదాపుగా 40,000పైగా సొంత ఇమేజ్ ఓట్లు ఉన్నాయి. ఒకప్పుడు టిడిపి హవాలో కూడా ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి దాదాపు 40,000 పైగా మెజారిటీ సాధించారు.  ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి తన పట్టును నిలుపుకున్నాడు. అంతేకాకుండా చీపురుపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో మమేకమై కలిసిపోతూ ఉంటాడు. అలాంటి బొత్స సత్యనారాయణ ఈసారి కూడా చీపురుపల్లిలో తన విజయకేతనం ఎగరవేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కళా వెంకట్రావు కొత్త అభ్యర్థి కావడం మరియు అక్కడ వారి బంధువు అయినటువంటి మృణాళిని టికెట్ కోసం ఆశించి భంగపడడం, టిడిపికి ఆమె పూర్తిగా సపోర్ట్ చేయకుండా ఉండడం ప్లస్ అవుతుంది. ఇవన్నీ చూసుకుంటే మాత్రం  సత్యనారాయణ  చీపురుపల్లిలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: