- శెట్టిబ‌లిజ‌ల చ‌రిత్ర‌లోనే ఎక్కువ సీట్లు ఇచ్చిన జ‌గ‌న్‌
- గోదావ‌రి జిల్లాల్లో బీసీల్లో తిరుగులేని ఓటింగ్ వీరి సొంతం
- రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లిచ్చి కూట‌మిని కుదేలు చేసిన జ‌గ‌న్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

గోదావ‌రి జిల్లాల్లోని బీసీల్లో అతిపెద్ద కులం శెట్టిబ‌లిజ‌. ఆంధ్ర‌, తెలంగాణ‌లో బ‌లిజ‌, శెట్టిబ‌లిజ పేర్ల‌తో చాలా కులాలు ఉండ‌డంతో స‌హ‌జంగానే ఈ శెట్టి బ‌లిజ కులం విష‌యంలో కొంద‌రికి సందేహాలు ఉంటాయి. శెట్టి బ‌లిజ‌లు క‌ల్లు గీత వృత్తిని ఆరాధ్యంగా భావిస్తారు. అయితే ఇప్పుడు వీరిలో చాలా మంది ర‌క‌ర‌కాల రంగాల్లో టాప్ పోజిష‌న్లో ఉన్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, విశాఖ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ కులం ఉంటుంది. ఈడిగ, గౌడ‌, యాత‌, శ్రీ శ‌య‌న కులాల‌తో వీరికి సోద‌ర సంబంధం ఉంటుంది. 100 ఏళ్ల నుంచి ఈ కులం త‌మ పేరు కొన‌సాగిస్తూ వ‌స్తోంది.


ఓవ‌రాల్‌గా చెప్పాలంటే గౌడ ఉప‌కులాల‌కు చెందిన కుల‌మే ఈ శెట్టిబ‌లిజ‌. ఇక గోదావ‌రి జిల్లాల్లో వీరు చాలా ఎక్కువ‌. న‌ర‌సాపురం పార్ల‌మెంటు, అమ‌లాపురం పార్ల‌మెంటు ప‌రిధిలో వీరి ప్ర‌భావం ఎక్కువ‌. అలాగే కాకినాడ‌, రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానాల్లో కూడా వీరు చాలా ఎక్కువ‌. వీరు ముందు నుంచి తెలుగుదేశంతోనే ఎక్కువుగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే 2019 నుంచి వీరిని త‌మ వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలో జ‌గ‌న్ వేస్తోన్న ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతున్నాయి. 2019లోనే రాజ‌మండ్రి సీటును గౌడ వ‌ర్గానికి చెందిన మార్గాని భ‌ర‌త్‌కు ఇస్తే ఆయ‌న ఎంపీ అయ్యారు.


ఇక జ‌గ‌న్ 2019లో గెలిచాక ప‌శ్చిమ గోదావ‌రి డీసీసీబీ చైర్మ‌న్‌తో పాటు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి శెట్టిబ‌లిజ‌ల‌కు ఇచ్చారు. ఆ త‌ర్వాత అదే క‌వ‌రు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. కుడిపూడి సూర్య‌నారాయ‌ణ రావు, క‌వురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక ఈ సారి అయితే రాజ‌మండ్రి అసెంబ్లీ సీటు గౌడ వ‌ర్గానికి చెందిన మార్గాని భ‌ర‌త్‌రామ్‌కు, రాజ‌మండ్రి రూర‌ల్ సీటు శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌కు, రామ‌చంద్రాపురం సీటు పిల్లి సుభాష్ త‌న‌యుడు పిల్లి సూర్య‌ప్ర‌కాష్‌కు ఇచ్చారు.


అన్నింటికి మించి ఇదే శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ను వైసీపీ ఏకంగా రాజ్య‌స‌భ‌కు పంపింది. ఇప్పుడు ఏకంగా రాజ‌మండ్రి, న‌ర‌సాపురం పార్ల‌మెంటు స్థానాలు కూడా ఈ శెట్టిబ‌లిజ వ‌ర్గానికే కేటాయించింది. ఇక ప‌శ్చిమ‌లో పాల‌కొల్లు సీటు కూడా ఇదే శెట్టి బ‌లిజ వ‌ర్గానికి చెందిన గుడాల గోపీకి ఇచ్చింది వైసీపీ. దీంతో ఈ కులంలో మెజార్టీ వారంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. అదే కూట‌మి నుంచి కేవ‌లం రామ‌చంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్‌, ఇటు ఆచంట‌లో పితాని స‌త్య‌నారాయ‌ణ‌కు మాత్ర‌మే ఇచ్చారు. అస‌లు ఎంపీ సీటే లేదు. ఏదేమైనా ఈ సారి గోదావ‌రి జిల్లాల్లో శెట్టిబ‌లిజ‌ల్లో చాలా వ‌ర‌కు వైసీపీకి అనుకూల‌మైన మార్పు అయితే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: