ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న ఓటింగ్ పూర్తి అయ్యింది.. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ కి జగన్ సీఎంగా ఉండగా మరో ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా ఉండే అవకాశం ఉందనే విధంగా పలు రకాల వార్తలయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా రూరల్ అర్బన్ ఏరియాలలో పథకాల ప్రయోజనాలు పొందిన వారంతా కూడా మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి జగనే సీఎం కావాలనుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వైసిపి అభ్యర్థులు కూడా పట్టు వీడకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేయడం కూడా ఆ పార్టీకి బాగా కలిసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.


మళ్లీ సీఎం జగన్ అయితే మాత్రమే పథకాలు కూడా అమలవుతాయనే విధంగా ప్రజలు చెప్పుకుంటున్నారు.. రాష్ట్రంలో వృద్ధులు మహిళలు ఎక్కువగా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు చెప్పాల్సిన పనిలేదు.. అందువల్ల రాష్ట్రంలో వైసీపీ పార్టీ కచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు నేతలు వైసిపి పార్టీ నేతలు కూడా చాలా ధీమాతో ఉన్నారు.. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కూడా చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి నియోజవర్గాలలో వైసిపి పార్టీకి చెక్ పెట్టే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.



ప్రతి జిల్లాలలో కూడా సగానికి పైగా సీట్లు వైసిపి పార్టీకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో కూడా వైసిపి పార్టీ మరింత యాక్టివ్ గా ఉంటూ కూటమికి ధీటుగా కౌంటర్లు వేస్తూ ఉన్నారు.. అటు కూటమి కూడా ఈసారి తమదే అధికారం అనే విధంగా ధీమాతో ఉన్నది.. మరి పూర్తిగా ఎవరు ప్రజలు మద్దతు ఉందనే విషయం తెలియాలి అంటే వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉండాల్సిందే.. ఏది ఏమైనా సోషల్ మీడియా వైసిపి పార్టీ బలం ముందర ఇతర పార్టీ బలం ఉండదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: