వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క డైలాగ్ తో గేమ్ చేంజర్ అయ్యారా అంటే అవుననే అనిపిస్తుంది. 2019 వ సంవత్సరపు ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలని గెలిచి రికార్డులు సృష్టించి వైసీపీ చరిత్ర సృష్టించడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు సాధిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పడం అనేది నిజంగా దమ్మున్న నేతకి ఉన్న సహజ లక్షణం. సాధారణంగా జగన్ మోహన్ రెడ్డి తనపై తనకు నమ్మకం లేకుండా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యరు. ఆయన చేశారంటే ఖచ్చితంగా అది నిజం అయ్యి తీరుద్ది. గతంలో కూడా ఈ విషయం రుజువు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో కొండంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సీఎం జగన్ చేసిన కామెంట్లతో ఏపీలో బెట్టింగ్ ట్రెండ్ కూడా  క్రమంగా మారుతోంది. జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి చాలా వార్త సంస్థలు కూడా సర్వేలు చేసి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాయి. ఆ సర్వేల ఫలితాలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి పూర్తి అవగాహన ఉంది.


మరోవైపు అభ్యర్థుల ఎంపికలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న జాగ్రత్తలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకారం రాయలసీమతో పాటు కూటమి కూడా బలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే  కూటమి భవిష్యత్తులో సైతం ఏమాత్రం కోలుకునే పరిస్థితి  ఉండదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం  లేదు. ఎన్నికల ఫలితాలలో తామే విజయం సాధిస్తామని భావిస్తున్న మోడీ, చంద్రబాబు, లోకేశ్, పవన్, బాలయ్య, షర్మిళలకు జగన్ మోహన్ రెడ్డి కామెంట్లు ఖచ్చితంగా బుల్లుట్స్ లా దిగుంటాయి. 2019 వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ లభించింది. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోయినా కానీ ఏం ప్రాబ్లెమ్ లేదు. ఈ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్  అవ్వడం పక్కా. అలా అయితే మాత్రం జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో దేశం మొత్తానికి కూడా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: