ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న వీటి రిజల్ట్స్ వెలువడనున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఫలితాల కంటే ముందే తనకు ఎన్ని సీట్లు వస్తాయో స్పష్టంగా తెలిపారు. గతంలో వచ్చిన 150 సీట్లు కంటే ఎక్కువగా అంటే 151 లేదా అంతకంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు తాను గెలుచుకోబోతున్నానని ధీమాగా ప్రకటించారు. 22 + ఎంపీ సీట్లు కూడా వస్తాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిజానికి ఎన్నికల సర్వేలన్నీ కూడా 120 లేదా అంతకు తక్కువగా వైసీపీ అసెంబ్లీ సీట్లను విన్ అవుతుందని మాత్రమే అంచనా వేశాయి పోయినసారి లాగా భారీ మెజారిటీ కష్టం అన్నాయి.

మిగతా వైసీపీ నేతలు కూడా 117 నుంచి 130 రేంజ్ లో సీట్లను గెలుచుకోవడం సాధ్యమవుతుందని నమ్మారు. జనాలు, పొలిటికల్ అనలిస్టులు కూడా అదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. ఒక్క జగన్ మాత్రమే తనకు పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఎవరికీ తెలియని జగన్ కి ఉన్న ఆ నమ్మకం ఏంటి? ఏ నమ్మకంతో ఆయన కాన్ఫిడెంట్ గా అన్ని సీట్లు వస్తాయని చెబుతున్నారు? మామూలు గెలుపు వచ్చినా చాలు అని అనుకుంటున్నా జగన్ ఎందుకు ఇలా ఒక క్లీన్ స్లీప్ లేదంటే ఇంతకుముందు కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటానని అంటున్నారు? అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఆయన పెట్టుకున్న నమ్మకం ఏంటో జూన్ 4వ తేదీనే తెలుస్తుంది.

ఇకపోతే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా కామ్ అయిపోయారు. ప్రజలు తమకే ఓట్లు వేశారు తాము గెలుస్తున్నాం అని ఒక ప్రకటన కూడా ఆయన ఇవ్వలేకపోయారు. ఎల్లో మీడియా కూడా చాలా సైలెంట్ అయిపోయింది. తాను గెలుస్తామని ధైర్యంగా చెప్పలేకపోతోంది. దీన్ని బట్టి జగనే గెలుస్తారని వారికి కూడా అర్థమైనట్టుగా తెలుస్తోంది. మెజారిటీ ఎంత పెరుగుతుంది లేదా ఎంత తగ్గుతుంది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: