ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు ప్రజలు వాటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా రిజల్ట్స్ తమకు అనుకూలంగానే వస్తాయా అనే ఆశతో జూన్ 4 కోసం వెయిట్ చేస్తోంది ప్రస్తుతానికైతే సర్వేలు ఏ విషయాన్ని కచ్చితంగా తెలపలేకపోతున్నాయి కొన్ని టైట్ ఫైట్ ఉంటుందని చెబుతుంటే.. మరికొన్ని కూటమి గెలవవచ్చు అని చెబుతున్నాయి. ఇంకొన్ని వైసీపీదే చేయమంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు నిలబడటం వల్ల టీడీపీ కి మంచి ఎడ్జ్ ఉంటుందని గెలిచే అవకాశాలు కూడా ఉండొచ్చని కొందరు అంటున్నారు. కొంతమంది వైసీపీకి కొన్ని చోట్ల ఎడ్జ్ లేదు కాబట్టి ఓడిపోవచ్చు అని పేర్కొంటున్నారు.

కానీ జగన్ మాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా తన మార్కు చూపించబోతున్నానని స్పష్టం చేస్తున్నారు. క్లీన్ విక్టరీ తనదేనని చెబుతున్నారు. కూటమి రేపు అంచుల దరిచేరదు అని ఆయన చేస్తున్న కామెంట్లు వైసీపీ నాయకులలో ధైర్యాన్ని నింపుతున్నాయి. జోక్ ఏంటంటే జగన్ నవ్వుతూ విజయం సాధించినట్లే ప్రవర్తిస్తుందే చంద్రబాబు చాలా ముభావంగా, బాధపడినట్లు కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం యుద్దంలో ఓడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లేలాగా కనిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం మౌనం పాటిస్తున్నాడు. ఈనాడు కూడా టీడీపీ గెలుస్తుందని నిస్సందేహంగా ఆర్టికల్స్ రాయలేకపోతోంది.

 మొత్తం మీద పోయినసారి లాగానే ఈసారి కూడా జగన్ మార్క్ చూపించేలాగానే ఉంది. ఈ మార్క్ కారణంగా టీడీపీ నాయకులు అధినేతలు వద్దు కుదుర్చుకున్న బీజేపీ వాళ్ళందరూ కూడా తల పట్టుకునే పరిస్థితి రావచ్చని కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు దాకా ఒక కంక్లూషన్ కి ఎవరూ రాలేరు. గెలిస్తే సంక్షేమ పథకాల వల్ల జగన్ గెలిచారు అనే ఒక అభిప్రాయం దేశమంతటా ఏర్పడుతుంది. జూన్ 4వ తేదీన ఏమవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: