మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల క్రితం బన్నీ గురించి చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. మావాడైనా పరాయివాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ విమర్శలపాలైంది. బన్నీ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారే తప్ప వైసీపీ కాదని తెలిసినా నాగబాబు అంత ఘాటుగా రియాక్ట్ కావడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. బన్నీ ఫ్యాన్స్ గత రెండు రోజులుగా నాగబాబును టార్గెట్ చేశారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి ఒకింత భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ ఫ్యాన్స్ అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో నాగబాబు తన ట్విట్టర్ ను డీ యాక్టివేట్ చేశారని సమాచారం అందుతోంది. ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ లో అల్లు అర్జున్ నాగబాబు గురించి అసభ్యకరంగా కామెంట్ చేసినట్టు ఉంది.
 
వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ ట్వీట్ అయినా ఆ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం నాగబాబును బాధ పెట్టిందని ఆ ట్వీట్ వల్లే ట్విట్టర్ డీ యాక్టివేట్ చేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ మాత్రం నాగబాబు ట్వీట్ విషయంలో మౌనంగానే ఉన్నారనే సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మాత్రం బన్నీ నాగబాబు ట్వీట్ గురించి కచ్చితంగా స్పందిస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
నాగబాబు ట్వీట్ మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ను పెంచిందని చెప్పడంలో మాత్రం సందేహం అయితే అక్కర్లేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సైతం బన్నీ విషయంలో ఒకింత సీరియస్ గా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవి మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ ఉన్నా బన్నీ తన టాలెంట్ తోనే కెరీర్ పరంగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి బన్నీ విషయంలో మెగా హీరోలు  కక్ష కట్టడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: