గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. 151 స్థానాలతో బంపర్ విక్టరీ కొట్టింది. నాటి ఎన్నికల్లో వైసీపీ ఆత్మవిశ్వాసం ముందు.. అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం కనీస స్థాయిలో నిలబడలేకపోయింది. అదే ఆ పార్టీకి విజయం సాధించి పెట్టింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. గత ఎన్నికల్లో వ్యక్తమైన విశ్వాసం, ఆత్మస్థైర్యం ప్రస్తుతం కనిపించడం లేదు.


దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజార్టీ తమకే వస్తుందని.. సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపస్తోందని అవి ఓట్లుగా మారతాయని.. వైసీపీ భావించింది. కానీ సంక్షేమ పథకాలు అందుకున్నందు వల్లే.. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరవలేకపోయారు. ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఉన్న వారు సైతం బహిరంగంగా వ్యక్త పరచలేకపోయారు.


దీంతో వారంతా తమ వారేనని వైసీపీ నేతలు భావించారు. అయితే అది పోలింగ్ కు ముందు తేలిపోయింది. ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. కూటమికి పాజిటివ్ మూడ్ అయితే వ్యక్తం అవుతుంది. ఇది కూటమి నేతలు తెచ్చిన వేవ్ హా..లేకా ప్రజలదా తెలియదు కానీ.. వైసీపీకి మాత్రం ప్రతికూలంగా మారింది. 2019లో టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు వైసీపీ ఫేస్ చేస్తోంది.


నాడు ఎన్నికల ముందే టీడీపీ చేతులెత్తేసింది. ఈ విషయంలో వైసీపీ పరిస్థితి కాస్త బెటర్ గా ఉంది. పోలింగ్ వరకు గెలుస్తామనే నమ్మకాన్ని క్యాడర్లో కల్పించింది. మంత్రి రోజా సైతం తమ పార్టీ నాయకులే తన ఓటమికి కృషి చేశారు లాంటి స్టేటస్ లు ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు సైలెంటె అయిపోయారు. ఇప్పుడు కీలక నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు సైతం ఈసీ కూటమికి సహకరించిందని.. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని చెప్పడం ద్వారా ఓటమి భయాన్ని బయట పెట్టినట్లే అయింది. మొత్తంగా నాటి వేవ్ అయితే ప్రస్తుత వైసీపీలో కనిపించడం లేదన్నది విశ్లేషకుల వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: