ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నియోజకవర్గాలలో పులివెందుల నియోజకవర్గం ఒకటనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ కు 90 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. అయితే జగన్ మెజారిటీని ఆయనే బ్రేక్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు లక్ష కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది.
 
మరి వైఎస్ జగన్ ఆ స్థాయిలో మెజారిటీ సాధిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పులివెందులలో జగన్ ను ఓడించాలని జగన్ జోరుకు బ్రేకులు వేయాలని టీడీపీ నేతలు ఎంతో కష్టపడుతున్నా ఆ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. వైఎస్ జగన్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి 2019 సంవత్సరంలో వైసీపీని అధికారంలోకి తీసుకొనిరావడంలో సక్సెస్ సాధించారు.
 
2024 ఎన్నికల్లో సైతం వైసీపీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వచ్చిందని జగన్ చెబుతున్నారు. వైసీపికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది మహిళలు ఆ పార్టీకి అనుకూలంగా వేశారని తెలుస్తోంది. పురుషులలో కూడా దాదాపుగా 45 శాతం మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసినట్టు ఆ పార్టీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారమే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్ మరీ నమ్మకంతో చెబుతున్నారు.
 
వైసీపీ నేతలది కాన్ఫిడెన్స్ అని కొందరు కామెంట్లు చేస్తుండగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో జరగని స్థాయిలో ఏపీలో పోలింగ్ జరిగిందనే సంగతి తెలిసిందే. వైసీపీ మైండ్ గేమ్ తో కూటమికి భారీ షాకిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 9న రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చేస్తున్న ప్రకటనలు ఎల్లో టీమ్ కు షాకిస్తున్నాయి. జగన్ ప్రకటన నిజమవుతుందో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: