జగన్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి సీఎం పీఠం ఎక్కబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  ఇదే తరుణంలో జగన్ కూడా 151 కి పైగా అసెంబ్లీ సీట్లు సాధిస్తామని 22 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామని బాహాటంగానే చెప్పేశారు. ఈ విధంగా జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఆయన తప్పక విజయం సాధించే అంశాలు కనిపిస్తున్నాయి.  ఏ రాజకీయ పార్టీ అయినా బరిలో దిగేముందు వారికి కలిసి వచ్చే అంశాలు నష్టాల గురించి తప్పనిసరిగా సర్వే చేయించుకుంటుంది.  ఆ విధంగానే జగన్ కూడా ఎన్నో సర్వే సంస్థల ద్వారా సీక్రెట్ గా తనకు కలిసి వచ్చే అంశాలు, ప్రభుత్వ వ్యతిరేఖాంశాలు, ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులు అన్నీ ముందుగానే తెలుసుకున్నారు. ఆ విధంగానే ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికల బరిలో దూకారు. మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి  మూడు కలిసి వస్తున్నా కానీ, జగన్ మాత్రం ఒంటరిగానే  ఓట్లు కొల్లగొట్టారని చెప్పవచ్చు. అలాంటి జగన్ కి ఈ పది అంశాలు తప్పక కలిసి వస్తాయని  ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దామా.
 ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ రెడ్డి:
 ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఓట్ల విషయానికి వస్తే..ఇవి పూర్తిస్థాయిలో వైసీపీకే పడే అవకాశం ఉంది.. దీనివల్ల వైసిపికి మెజార్టీ పెరిగే అవకాశం ఉంటుంది.

 కాపు ఓట్లు:
 2014లో కాపు ఓట్లు ఎన్డీఏ కూటమికి పడ్డాయి. కానీ 2019లో ఎక్కువ కాపు ఓట్లు  వైసీపీ వైపు మగ్గాయి. 2024లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉన్న ఏవైనా కాపు యూత్ లో ఉంటుంది తప్ప, వారి ఓట్లు జగన్ వైపే  ఉన్నట్టు తెలుస్తోంది. చాలా సర్వేలు కూటమికి పడతాయని చెప్పాయి.కాపుల ఓట్లు వారికి అనుకున్నంత పడలేదని జగన్ నమ్మకం.
 కూటమి సమస్యలు:
 బిజెపి టిడిపి జనసేన కలవడం బాగానే ఉంది కానీ ఓట్లు రాబట్టే విషయంలో ముగ్గురి మధ్య సఖ్యత కుదరలేదని చెప్పవచ్చు. సీట్ల పంపకాల్లో వచ్చిన విభేదాలు ఓట్ల తగ్గింపుకు కారణం కావచ్చు.
 దీనివల్ల వైసిపి వ్యతిరేక ఓటు చీలిపోవడం, ప్లస్ గా మారడం జరిగింది అని జగన్ భావిస్తున్నారు.
 షర్మిల:
 షర్మిల వచ్చాక కాంగ్రెస్లో  ఉత్సాహం వచ్చింది. ఇది పెద్ద ఎఫెక్ట్ కాదు . కానీ కొన్ని  పోటీ ఉండే నియోజకవర్గాల్లో  షర్మిల కారణం కావచ్చు.

 సంక్షేమ పథకాలు:
జగన్ తీసుకొచ్చిన పథకాలను మించి చంద్రబాబు పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన పథకాలపై ప్రజల్లో అంత విశ్వసనీయత కలిగినట్లు కనిపించడం లేదు.
 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ :
ఇది కూటమికి ఎంతో ఉపయోగపడుతుందని వారు భావించారు. ఈ యాక్టు అమలుకు అసెంబ్లీలో టిడిపి మద్దతు ఇచ్చింది. దీన్ని వైసిపి మరో రకంగా ప్రచారం చేసింది.  చంద్రబాబు వస్తే ప్రభుత్వం అందించిన భూమి పట్టాలు రద్దు అవుతాయని  జనాల్లో భయాన్ని సృష్టించింది.

 వాలంటీర్లు:
 50 మందికి ఒక వాలంటీర్ ను వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చింది. కాబట్టి వారు ఎన్నో ఓట్లను ప్రభావితం చేసి ఉంటారు.
 ఓటు పెరుగుదల:
 ఓట్లు పెరగడం అనేది రెండు పార్టీలు మాకు ప్లస్ అంటే మాకు ప్లస్ అని చెబుతున్నాయి. కానీ ఓటింగ్ శాతం పెరిగింది ఇరు పార్టీలు డబ్బులు పంచడం వల్ల అని కొంతమంది అంటున్నారు. ఓటింగ్ పెరిగింది ఓటింగ్లో మహిళలు ఎక్కువ పాల్గొన్నారు కాబట్టి వైసీపీకి కాస్త ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది.
 రూరల్ ఓట్లు:
 రూరల్ ప్రజల్లో ఎంతో కొంత మైనస్ ఉన్నా కానీ వారు అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందాయి.దీని వల్ల వైసిపికి ఫేవర్ గా మారే అవకాశం ఉంది.
కొత్త ఓటర్లు:
 ఈ ఎన్నికల దాదాపు 5 లక్షల కొత్త ఓటర్లు పెరిగారు. ఇక ఈ కొత్త ఓటర్లలో కూడా చాలామంది యూత్ ఉండడంవల్ల వారు ఇప్పటికే జగన్ నుండి ఎన్నో కొన్ని పథకాలు పొంది ఉంటారు.అలా కొత్త ఓటర్లు వైసిపి పార్టీకి మద్దతు తెలిపారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: