•రాయలసీమ గడ్డపై జగన్ దే హవా

•పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దే విజయం..

•మెజారిటీపై బెట్టింగ్..

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ , లోకసభ ఎన్నికలకు  పోలింగ్ కాస్త పూర్తయిన నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో ఇంకా ఎన్నికల వేడి మాత్రం తగ్గడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి?  ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పోటీ చేసిన పులివెందుల,  మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గాలలో ఎన్నికల వేడి కాస్త తగ్గినా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నియోజకవర్గాలలో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం కూడా ఒకటి.. ఆంధ్రప్రదేశ్ మంత్రి వైసిపి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పోటీ చేయడం మొదటి నుంచి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే..

ఇకపోతే పుంగనూరు నుంచి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు ఎలా ఉన్నా సరే ఆయన మెజారిటీ మీద ఎక్కువగా బెట్టింగులు జరుగుతూ ఉండడం ఆశ్చర్యకరం.. ఇకపోతే ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయానికి వస్తే.. వైసిపి తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , టిడిపి తరఫున చల్లా రామచంద్రారెడ్డి అలాగే సొంత పార్టీ అభ్యర్థిగా బోడె రామచంద్ర యాదవ్ పోటీలో నిలిచారు.. పలు పార్టీల సింబల్ మీద పుంగనూరు నుంచి కొంతమంది అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయగా .. పుంగనూరులో పెద్దిరెడ్డి హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన పెద్దిరెడ్డికి గతంలో ఎంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అంటూ ఇప్పుడు పుంగనూరులోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.

ఇకపోతే ఇక్కడ చాలా సామాజిక వర్గాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. సీమ గడ్డపై జెండా పాతేది వైసిపి నే అని స్పష్టం అవుతుంది. మొత్తానికి అయితే రాయలసీమ గడ్డపై మళ్లీ వైఎస్ జగన్ జండా పాతబోతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: