ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా రాటుదేలారు. రాజకీయ వ్యూహాలు కొనడంలో ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబుకి మించిన నేత మరి ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. జగన్ మంచి నాయకుడే కావచ్చు కానీ చంద్రబాబు కంటే ఆయన రాజకీయాల్లో ఆరితేరారు అనడం మూర్ఖత్వమే అవుతుంది. చంద్రబాబు ఈసారి ఎలాగైనా గెలవాలని తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించేసారు. కొన్ని విషయాల్లో తడబడినా ప్రజలను తమకు ఓటు వేసే లాగా మ్యానిప్యులేట్ చేయడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

మొదటగా ఆయన లేవనెత్తిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గ్రౌండ్ లెవెల్ లో చాలామంది లోకి వెళ్లిపోయింది. పోలింగ్ బూత్ కి వెళ్లే ముందు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్  ఫ్యాట్ గురించి ఫోన్ కాల్స్ వెళ్ళిపోయాయి. ఈ అన్ని ప్రయత్నాల ద్వారా సదరు చట్టం వల్ల భూమి ఉన్న వారికి ఇబ్బంది అవుతుందనే ఒక ఆందోళనను చంద్రబాబు క్రియేట్ చేయగలిగారు. చట్టం వల్ల తమ భూమి ఏమైనా కోల్పోతామా అన్న భయంతో జగన్‌కు భూములు ఉన్నవారు ఓటు వేయకపోవచ్చు. చంద్రబాబుకే వారు ఓటు వేసి ఉండవచ్చు.

సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. అన్ని సంక్షేమ పథకాలు జనాలు నమ్మి ఉండకపోవచ్చు కానీ పెన్షన్ పెంచుతాం, నెలకు రూ.4,000 ఇస్తాం. ఒకేసారి రూ.7,000 ఇస్తాం అని చంద్రబాబు చెప్పినది వృద్ధులు కచ్చితంగా నమ్మి ఉంటారనేది పొలిటికల్ చెబుతున్న మాట. ఎందుకంటే గతంలో పెన్షన్లు పెంచుతామని పెంచేశారు. ఆ మంచి చేశారు కాబట్టి అదే ఇప్పుడు ఆయనకు ఓట్లు పడేలా చేసి ఉండవచ్చు. నిరుద్యోగ భృతి జగన్ ఉన్నప్పుడు ఇవ్వలేదు కానీ చంద్రబాబు దిగిపోయే ముందు ఈ డబ్బులను జమ చేశారు. ఇప్పుడు కూడా అదే హామీ ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులు కూడా నిరుద్యోగ భృతి కోసం చంద్రబాబు వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. చంద్రబాబు టీం లో పవన్ కూడా ఉన్నారు పవన్ యువతరం గురించి బాగా ఆలోచిస్తారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తారు.

అందువల్ల యువతరం బాగా ఆలోచించి చంద్రబాబుకు ఓట్లు క్యాస్ట్ చేశారనేది కొందరు చెబుతున్న మాట. ఇవన్నీ అంశాలను వైసీపీ నేతలు ఆలోచించుకుంటూ బాగా భయపడుతున్నారట. ఎగ్జిట్ పోల్స్ వచ్చేదాకా జగన్ కూడా వణుకుతూనే ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు అనేది ఎవరూ చెప్పలేరు. వాళ్ల థింకింగ్ గ్రౌండ్ లెవెల్ లో చంద్రబాబు ఎలా ప్రజల్లోకి వెళ్లారు ఊహించడం కూడా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: