- నాన్ లోక‌ల్ మ‌హేష్ యాద‌వ్ కంటే లోక‌ల్ సునీల్ వైపే మొగ్గు
- అసెంబ్లీకి టీడీపీకి ఓట్లేసినోళ్లూ పార్ల‌మెంటుకు వైసీపీకే జై
- బాబుకు సీమోడు గ‌తి అయితే మా దెబ్బేంటో చూపిస్తామ‌న్న గోదారోడు..!

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఏలూరు పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం జరిగిన క్రాస్ ఓటింగ్.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు కొంప ముంచేయబోతుందా ? ఇక్కడ నాన్ లోకల్ అంశం టీడీపీ అభ్యర్థి గెలుపుకు అవరోధంగా మారిందా ? అంటే అవుననే చర్చలే ఇప్పుడు జరుగుతున్నాయి. వాస్తవానికి ఏలూరు పార్లమెంటు సీటు ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి సంప్రదాయ సీటుగా వస్తోంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి వైసీపీ అధినేత జగన్ బీసీ ప్రయోగం చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు సీటు ఇచ్చారు.


చంద్రబాబు సైతం యాదవ సామాజిక వర్గానికి ఈ సీటు ఇచ్చారు. అయితే ఎక్కడో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను ఏలూరు పార్లమెంటుకు దిగుమతి చేశారు.
గోదావరి జనాలు కులాలతో సంబంధం లేకుండా.. ఎవరిని అయినా ఆదరిస్తూ వస్తూ ఉంటారు. అయితే నాన్ లోకల్ వారిని ఇక్కడ ఎప్పుడూ గెలిపించలేదు. 2014 ఎన్నికలలో గుంటూరు నుంచి వైసీపీ దిగుమతి చేసిన తోట చంద్రశేఖర్‌ని కూడా చిత్తుగా ఓడించారు. పుట్టాఆ మహేష్‌కు ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వటం.. ఏలూరు పార్లమెంటు జనాలకే కాదు... టీడీపీ వర్గాలకు కూడా నచ్చలేదు. స్థానికంగా టీడీపీ ఎంపీ సీటు కోసం ఎంతోమంది అభ్యర్థుల పోటీపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా సీటు ఆశించారు.


చంద్రబాబు వీరందరినీ కాదని రాయలసీమ నుంచి అభ్యర్థిని దిగుమతి చేయటం ఇక్కడ గోదావరి జనాలకు ఎంత మాత్రం నచ్చలేదు. సొంత పార్టీలోనే చాలామంది వీరాభిమానులు సైతం అసెంబ్లీ వరకు టీడీపీకి ఓటు వేసి.. పార్లమెంటుకు వైసీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారన్న గుసగుసలు నడుస్తున్నాయి. ఇక సాధారణ జనాలు కూడా కారుమూరు సునీల్ అయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి.. అందుబాటులో ఉంటాడని.. అదే మహేష్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే నాన్ లోకల్ గా అందుబాటులో ఉండడు అని.. పార్లమెంటుకు వైసీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది.


అందుకే చాలా టీడీపీ అనుకూల సర్వేలు సైతం అసెంబ్లీలలో టీడీపీ గెలుస్తుందని పార్లమెంట్‌కు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా ఉందని చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇక్కడ టీడీపీ అధిష్టానంతో పాటు యనమల మహేష్ ఫ్యామిలీలో సైతం ఆందోళనకు కారణం అవుతుంది. మరి ఈ క్రాస్ ఓటింగ్ మహేష్ కుమార్ యాదవ్ గెలుపు, ఓట‌ములను నిర్ణయించే స్థాయిలో పడిందా..? లేదా..? అన్నది జూన్ 4న ఫలితాలలో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: