ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తీవ్ర ఉత్కంఠ అనేది నెల‌కుంది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రార‌ని చాలా ముందుగానే అంద‌రికీ అర్థ‌మైన సంగతి అందరికి తెలిసిందే. అప్పుడు దానికి బలమైన కార‌ణం కూడా ఉంది. అదే చంద్ర‌బాబు నాయుడి అధ్వాన్న‌మైన పాల‌నే. అయితే ఈ సారి అధికారం ఎవ‌రికి వస్తుందో ఎవ‌రూ కూడా స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు. అసలు ఓట‌రు నాడిని ప‌సిగ‌ట్ట‌లేక‌పోతున్నారు.దీంతో త‌మ అభిమానానికి త‌గ్గ‌ట్టుగా అధికారంపై లెక్క‌లేస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాద‌నేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌, చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సూప‌ర్‌సిక్స్‌కు తోడు మ‌రిన్ని ప‌థ‌కాల‌పై జ‌నాలు ఆసక్తిగా ఉన్నారని తెలుగు దేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇక మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ కొత్త‌గా ఎలాంటి ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌లేద‌ని కూడా అంటున్నారు. అలాగే జ‌గ‌న్‌పై ఉద్యోగుల వ్య‌తిరేక‌త‌, ఉన్న‌త వ‌ర్గాల ఆగ్ర‌హం ఉందని టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు. ఇంకా వీటికి అద‌నంగా ఎన్నిక‌ల సంఘం మ‌ద్ద‌తు తోడైంద‌ని కూట‌మి అనుకూల నేత‌లు విశ్లేషిస్తున్నారు. అయితే చంద్రబాబు కంటే జగన్ చాలా మేలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహిళలకి, పేద వర్గాలకి ఆయన పథకాలు బాగా ప్లస్ అయ్యాయని ఆయనే మళ్ళీ సీఎం అవుతారని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.


ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని తాము అధికారంలోకి వ‌స్తామ‌ని వైసీపీ నేత‌లు నమ్ముతున్నారు. త‌మ‌కు ప్ర‌తికూల అంశాలున్న‌ట్టే, టీడీపీకి లేవా? అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న స‌న్నిహితుల వ‌ద్ద ప్రస్తావించిన‌ట్టు సమాచారం తెలిసింది. పొత్తు పెట్టుకోవ‌డం, జ‌న‌సేన‌, బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వ‌డం నెగెటివ్ కాదా? అని జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా తెలిసింది. ఇంకా అలాగే మేనిఫెస్టో విష‌యంలో బీజేపీ దూరంగా ఉండ‌డం వల్ల దాని విశ్వ‌స‌నీయ‌త పూర్తిగా పోయింద‌ని జ‌గ‌న్ మోహన్ రెడ్డి అభిప్రాయం.ఇంకా అలాగే చంద్ర‌బాబుకు విశ్వ‌స‌నీయ‌త లేక‌పోవ‌డంతో, ఆయ‌న ఇచ్చిన హామీల‌పై జ‌నం పెద్దగా ఆస‌క్తి చూప‌లేద‌ని జ‌గ‌న్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద అన్న‌ట్టు సమాచారం తెలిసింది. 2014 కూట‌మి మేనిఫెస్టోను పెద్ద ఎత్తున జ‌నంలోకి తీసుకెళ్లి, బాబు ఏ విధంగా మోస‌గిస్తారో చెప్ప‌డం వ‌ల్ల తాజా కూట‌మి మేనిఫెస్టోపై ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌గ‌లిగామ‌ని జ‌గ‌న్ మోహన్ రెడ్డి అన్న‌ట్టు తెలిసింది.చంద్రబాబు  విశ్వ‌స‌నీయ‌త‌పై త‌న విశ్వ‌స‌నీయ‌త విజ‌యం సాధిస్తుంద‌ని జగన్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే 150కి పైగా సీట్లు ఖచ్చితంగా సాధిస్తామ‌ని జ‌గ‌న్ బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: