ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 13న పూర్తి అయ్యాయి.. ముఖ్యంగా టిడిపి, వైసిపి పార్టీ మధ్య ఈసారి ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. నూతన ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయం పైన ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. కేవలం అది ఈవీఎం లో మాత్రమే చాలా భద్రతగా ఉన్నది. జూన్ 4వ తేదీన తెరిస్తే చాలు రాజకీయ పార్టీల జాతకాలు అందరివి కూడా బయటపడిపోతాయి.. జగన్, చంద్రబాబు తప్ప ఏపీలో సీఎం ఎవరు అనే పేరు ఎక్కడ మరో పేరు వినిపించదు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే..


2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అప్పులు చేశారు.. చివరికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి 2019 ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వచ్చాక నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచడానికి చంద్రబాబు చేసిన అప్పులలో కొంత భాగం మాత్రమే చేశారని టాక్ ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులు అక్షరాల ప్రస్తుతం 10 లక్షల కోట్లకు మించి ఉందనే మాట వినిపిస్తోంది.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముళ్ళబాటే అవుతుందని చెప్పవచ్చు.


ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి దాదాపుగా ఐదారువేల కోట్ల దాకా అవుతుంది.. సామాజిక పెన్షన్ జగన్ వస్తే 3000 రూపాయలే అనుకున్న.. 5000 కోట్లు అవుతుంది అదే చంద్రబాబు వస్తే 6000 కోట్లు అవుతుందట.  సంక్షేమ నిధులు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కి పెండింగ్లో ఉండడంతో వీటిని రిలీజ్ చేయాలి ఈ సొమ్ము పదివేల కోట్ల రూపాయలు ఉన్నది. ఈ ఏడాది అంతా కూడా అప్పులు ఇంకా చేయవలసి ఉంటుంది. రాబోయే కొన్ని నెలలలోనే ఉద్యోగులు వేళల్లో రిటైర్మెంట్ అవుతారు. అంతేకాకుండా వారంతా ఓల్డ్ ఫంక్షన్స్ స్కీం కింద రిటైడ్ అవుతారు. అలాగే కొత్త పిఆర్సి నుంచి కూడా ఫిట్మెంట్తో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల అదనంగా భారం పడుతుంది.


ఒకవేళ చంద్రబాబు వస్తే జగన్ కంటే రెట్టింపు సొమ్ముని ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం 2 లక్షల మంది కొత్త టీచర్ల నియామకాలు అని ఊదరగొట్టారు.. అభివృద్ధి చేస్తామని రోడ్లు వేస్తామని మహిళలకు 1500, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా 20,000. ఇతరత్రా హామీలతో ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధి మేరకే సహాయం ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: