ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ లో అధికార పార్టీ వైసీపీ పార్టీకి 55% ఓట్ షేరింగ్ వస్తుందని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కచ్చితంగా ఈసారి కూడా జగన్ 150 సీట్ల తో గెలుస్తారని ధీమాతో ఉంటున్నారు.. ఇటీవల ఐ ప్యాక్ కార్యాలయానికి సందర్శించిన జగన్ అక్కడ పలు వ్యాఖ్యలు తెలియజేశారు. 150 సీట్లు గెలిచి తీరుతామని చాలా కాన్ఫిడెంట్ గానే తెలియజేశారు.. అయితే అలా ఎలా చెప్పారనే విధంగా పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు. అయితే అందుకు గల కారణం కూడా ఉన్నదని తెలుస్తోంది.వాటి గురించి చూద్దాం.


ముఖ్యంగా సీఎం జగన్ అలా చెప్పడానికి కారణం ఐప్యాక్ సంస్థ ఒక యాప్ ద్వారా చేయించిన సర్వే నట.. పోలింగ్ రోజున ఐప్యాక్ సంస్థ ఒక యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 1700 మందితో సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 55% ఓట్ షేరింగ్ ఉందని తేలిపోయింది.. ఈ విషయాన్ని ఐపాడ్ సంస్థ జగన్ కు చెప్పడం వల్ల చాలా ధీమాతో ఉన్నట్లు సమాచారం.. 2023లో జరిగిన ఎన్నికలలో కూడా ఐప్యాక్.. ఇలాంటి యాప్ ఉపయోగించే సర్వే చేయించారట.


అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వేలో 65 నుంచి 70 సీట్లు వస్తాయని కాంగ్రెస్ కు తెలియజేసిందట. అనుకున్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. అందుకే ఇదే యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్వే చేయించినట్లు తెలుస్తోంది.. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి అంత ధీమాతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు సర్వే ప్రకారం వైసిపి పార్టీ రెండవసారి అధికారాన్ని అందుకుంటుందో చూడాలి మరి. అటు కూటమి కూడా తమ పార్టీని ఆంధ్రలో అధికారం వస్తుందనే విధంగా తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల పైన చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: