- అన్నీ స‌ర్వేల్లోనూ ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఓడే ఫ‌స్ట్ సీటు ఆముదాల‌వ‌ల‌సే
- పోలింగ్ స‌ర‌ళిలోనే త‌మ్మినేనికి ఓట‌మి సీన్ అర్థ‌మైందా ?

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం నైట్ అవుట్లు  చేస్తున్నార‌ట‌. అదేంటి? ఆయ‌నేమ‌న్నా.. ఈ వ‌య‌సులో చ‌దువుతున్నారా?  అని అనుకోవ‌ద్దు. కార‌ణాలు అనేకం ఉంటాయి. వీటిలో ప్ర‌ధానంగా ఆయ‌న‌కు ఎన్ని క‌ల ఫ‌లితంపై దిగులు ప‌ట్టుకుంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ఏదో పార్టీలో వైర‌ల్‌గా మారితే అనుకోవ చ్చు. కానీ, సొంత పార్టీ వైసీపీలోను.. సొంత నేత‌ల్లోనూ కూడా ఇదే చ‌ర్చ‌గా సాగుతోంది. ఇలా సీతారాం కు నిద్ర ప‌ట్ట‌క పోవ‌డానికి రెండు నుంచి మూడు కార‌ణాలు ఉన్నాయ‌ని గుసగుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


ఒక‌టి.. ఎన్నిక‌ల‌కు ముందువ‌చ్చిన ప్ర‌తి స‌ర్వేలోనూ.. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఓడిపోయే.. తొలి సీటు ఆము దాల వ‌ల‌సేన‌ని తేలింది. ఆ స‌ర్వే .. ఈ స‌ర్వే.. అని కాకుండా.. అన్ని స‌ర్వేల్లోనూ.. ఇదే ఫ‌లితం రావ‌డం తో త‌మ్మినేనికి ఎన్నిక‌ల‌కు ముందే.. తీవ్ర‌స్థాయిలో చ‌లీజ్వ‌రం ప‌ట్టుకుంద‌ని పార్టీలో నేత‌లు గుసగుస లాడుకున్నారు. ఇక‌, రెండో కార‌ణం.. అధికారులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం. ఆయ‌న స్పీక‌ర్‌గా ఉన్న నేప‌థ్యంలో అధికారుల‌ను ప‌లుమార్లు బెదిరించిన వార్త‌లు ప‌త్రిక‌ల్లోనూ మీడియాలోనూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


`స్పాట్‌లో కొడ‌తా. నిన్ను ఇంటికి పంపేస్తా.. ` అంటూ.. అధికారుల‌పై త‌మ్మినేని చిందులు తొక్కారు. దీంతో అధికారులు, ఉద్యోగులు కూడా త‌మ్మినేనిని వ్య‌తిరేకంగా ఓటేశార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇది కూడా త‌మ్మినేనికి సెగ పెడుతోంది. ఇక‌, మూడో కార‌ణం. సెంటిమెంటు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్పీక‌ర్లు గా పోటీ చేసిన వారు త‌ర్వాత కాలంలో గెలిచిన దాఖ‌లా లేదు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నుంచి కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర‌కు.. ఎవ‌రూ గెల‌వ‌లేదు.


ఇలానే.. త‌న‌కు కూడా ఈ సెంటిమెంటు అంటుకుంటుందా? అనే దిగులుతో త‌మ్మినేనికి కంటిపై క‌నుకు క‌రువైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఎన్నిక‌ల పోలింగ్‌లో 79.62 శాతం ఓట్లు పోల‌య్యాయి. దీంతో ఇది కూడా .. స్పీక‌ర్‌కు ఇబ్బందిగా మారింది. ఇంత భారీ ఎత్తున పోలింగ్ జ‌రిగిన నేప‌థ్యంలో ఇదంతా కూడా త‌న‌కు వ్య‌తిరేకంగానే జ‌రిగి ఉంటుంద‌ని ఆయ‌న లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌తోనే స్పీక‌ర్ త‌మ్మినేనికి కంటిపై కునుకు క‌రువై... నైట్ అవుట్లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: