అసెంబ్లీ ఎన్నికలు 13వ తేదీన జరిగాయి. ఈ టైమ్‌లో పల్నాడు జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో పెద్ద గొడవలు చోటుచేసుకున్నాయి. టిడిపి శ్రేణులు వైసిపి వారిపై దాడులు చేసినట్లు ఫోటోలు వీడియోలు సర్కులేట్ అయ్యాయి. మీడియా వీడియో కవరేజీలలో కూడా టీడీపీ నేతలు పోలింగ్ బూత్‌లలోకి దూకి ఓటర్లను భయపెట్టడం కనిపించింది. వైసీపీ పోలింగ్ ఏజెంట్లపై కూడా టీడీపీ వారు దాడులు చేశారు. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని వైసీపీ వాళ్లు ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళ్తే తిరుగు దాడి చేశారని వారు వాపోయారు. రక్తసిక్తమైన హింసాత్మక ఘటనలు పోలింగ్ తేదీన చాలానే కనిపించాయి.

అయితే ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళే ఓటమి భయంతో ఇలాంటి దాడులను చేశారని జనాలు అనుకున్నారు కానీ టీడీపీ నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చారు ఈ దాడులు తాము చేయలేదని వైసిపి వాళ్లే చేశారంటూ వారు ఓ పెన్ డ్రైవ్‌ తెరపైకి తెచ్చారు. ఈ పెన్ డ్రైవ్ లో వైసీపీ వాళ్లు చేసిన దాడులు అన్ని రికార్డ్ చేశామని, దానిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ లీడర్ అయిన వినీత్ అందజేశామని ప్రకటించింది. మరోవైపు పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయాలని సిట్ టీమ్ ను ఎన్నికల సంఘం నియమించింది. సిట్ దర్యాప్తులోని పారదర్శకంగా ఉండాలి, జరగాలనే ఉద్దేశంతో ఈ పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగిందని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు.

చాలా రోజుల తర్వాత స్వేచ్ఛగా బీజేపీ ఆఫీసుకు వచ్చి ఆ డిజిటల్ ప్రూఫ్ ను అందచేయగలిగామని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని తాము అధికారంలోకి వస్తే ఇలాంటి శాంతియుతమైన పరిస్థితులు ఎల్లవేళలా నెలకొంటాయని అన్నారు. వర్ల రామయ్య ఈ పెన్ డ్రైవ్ అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలకు లోటు ఉండదని స్పష్టం చేశారు. ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఇది కలకలం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: