ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం ముగిసిన తర్వాత ఎవరు గెలుస్తారని విషయంపైన అందరూ ఆత్రుతగా ఎవరు చూస్తున్నారు.. ఇప్పటికే చాలామంది నేతలు సర్వే సంస్థలు పలు రకాల పార్టీలు గెలుస్తాయని అంచనా ప్రకారం తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల విశ్లేషకుడు పివిఎస్ శర్మ గారు తమ అభిప్రాయంగా ఒక విషయాన్ని వెల్లడించారు.. చాలామందితో మాట్లాడిన తర్వాత.. పలు విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ విషయంలో చివరి వరకు పోల్ మేనేజ్మెంట్.. ఓట్ల మేనేజ్మెంట్ ను తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి.. అది ఒక సక్సెస్ అయ్యిందని తెలిపారు పిఎస్ శర్మ..



దీంతోపాటు అభ్యర్థులను 80 మందిని మార్చడం కూడా ఆయనకి బాగా కలిసి వచ్చిందని.. అందులో కూడా సక్సెస్ అయ్యారని.. అనేకచోట్ల బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వడం వంటివి కూడా బాగా కలిసొచ్చాయని కూడా తెలియజేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాబోతున్నారని ఇది దేశంలోనే అందరిని సర్ప్రైజ్ చేయబోతుందంటూ తెలియజేశారు పిఎస్ శర్మ.. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ఎన్నో పథకాలు కూడా చాలా కుటుంబాలు సైతం లబ్ధి పొందాయి ముఖ్యంగా కులాల వారిగాని ఎన్నో పథకాలు కూడా అందరికీ చేపట్టారు.


అలాగే నాడు నేడు కింద స్కూల్లో బాగోగులు రేషన్ సరుకులను ఇంటి వద్దకే చేర్చడం.. వాలంటీర్ల ద్వారా అన్ని పనులు చేయించడం, పంట సబ్సిడీ, పంట నష్టం ఇతరత్రా వాటిలను కూడా ఆర్బికేలో చేయించడం ఆర్బీకేల ద్వారా మందులను కూడా సప్లై చేయడం.. ఇతరత్రా అంశాలన్నీ కూడా వైసిపి పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.. అలాగే ఉచితంగా ఇల్లు కట్టాలు ఇవ్వడం ఇల్లు కట్టి ఇవ్వడం వంటివి చెప్పడం కూడా బాగా కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పనులు చేయడం వల్ల ఈసారి కచ్చితంగా కూడా వైసిపి పార్టీని అధికారం వస్తుందని చాలామంది నేతలు సర్వేలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: