ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది.. అటు పూర్తి అయ్యిందో లేదో అటు పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, పురందేశ్వరి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పులివెందులకు వెళ్లి అక్కడి నుంచి తన కూతుర్లను చూడడానికి లండన్ కి సైతం వెళ్లడం జరిగింది.. అయితే లండన్ కి వెళ్లే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా 151 యొక్క సీట్లకు మించి వస్తాయని i-pac సంస్థ వద్ద తెలియజేయడం జరిగింది.


అయితే ఇప్పటివరకు చాలా సర్వేలు కూడా వైసిపి పార్టీ విజయాన్ని అందుకుంటుందనే విధంగా తెలియజేశాయి. ఇప్పుడు తాజాగా PTI అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక సర్వేని చేపట్టిందట.. మరొకసారి రాష్ట్రంలో కచ్చితంగా వైసీపీ పార్టీ అధికారం చేపడుతున్నట్లు ప్రకటించింది.. అంతేకాకుండా 145 సీట్లు వస్తాయని కూడా తెలియజేసింది. టిడిపి, బిజెపి, జనసేన కూటానికి కేవలం 29 సీట్లే వస్తాయని కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లుఐ సంస్థ ప్రీ పోల్ సర్వే తెలియజేసింది. అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనే విషయం తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..



ముఖ్యంగా కూటమి మాత్రం తామే అధికారంలోకి వస్తాం అంటూ విర్రవీగుతున్నప్పటికీ జగన్ మాత్రం సింపుల్ గానే ఈసారి అధికారంలోకి వస్తామని తెలుపుతున్నారు. వైసిపి నేతలు కూడా అధికారం మాదే అన్నట్లుగా తెలియజేస్తున్నారు. వైసిపి నుంచి ఎన్నో రకాలుగా ప్రజలు లబ్ధి పొందారని.. ఆసానుభూతి మమ్మల్ని గెలిపిస్తుందని నమ్మకం అందరిలో కలిగిందనీ అందుకే ఈసారి గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిందనే విధంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ గెలిస్తే కనుక చరిత్రలో ఇది నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: