ఆలూరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నుంచి గౌడ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆలూరు కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఏటా ఈ ప్రాంతాన్ని కరువు పలకరిస్తూ ఉంటుంది. ఇక్కడ నీటి కొరత వల్ల చాలామంది వేరే ప్రాంతాలకు తరలిపోతుంటారు. ఇక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వీరభద్ర గౌడ్‌ నియోజకవర్గ ప్రజల బాగోగులను చూసుకోవడానికి నిత్యం కృషి చేస్తుంటారు. ఎల్లప్పుడూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుతుంటారు.

2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బి. విరుపాక్షిపై  ఆలూరు అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ప్రజల మద్దతుతో ఆలూరులో టీడీపీ జెండా ఎగరేస్తాం అని వీరభద్ర గౌడ్‌ చెప్పుకుంటున్నారు. ఆయన మాటలకు తగినట్లే ఎన్నికల ప్రచార సమయంలో ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఘన స్వాగతం ఆయనకు లభించింది. ఆయన గతంలో చేసిన మంచి పనులను గుర్తుంచుకొని ప్రతి ఊరి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. వైసీపీ పాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడిన మాటలకు అంగీకరించారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళా ఆర్థికాభివృద్ధికి తమ టీడీపీ పార్టీనే బాటలు వేసిందని ప్రజలకు తెలియజేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ప్రజలు ఆయనను నమ్మి ఈసారి ఆయనకే ఓట్లు వేశారని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు వీరభద్ర గౌడ్ సంక్షేమ పథకాల చక్కగా అమలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టడానికి టీడీపీ అధిష్టానం నుంచి నిధులను తీసుకొచ్చారు. వెనుకబడిన ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించేందుకు తను ఒంటిగా కష్టపడ్డారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన చాలా మంచి పనులు ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి. అందువల్ల ఈసారి ఆయనను ప్రజలు గెలిపించుకోవచ్చు అని తెలుస్తోంది. వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలు టీడీపీ పార్టీ సంక్షేమ పథకాలను పొందారు. దానికి కృతజ్ఞతా భావంగా ఈసారి టిడిపి అభ్యర్థిని గెలిపించాలని వారు భావించినట్లు తెలుస్తోంది. అయితే జూన్ 4వ తేదీ లెక్కింపు పూర్తయ్య వరకు ఎవరు గెలుస్తారనేది కచ్చితంగా చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: