ఇప్పుడు ఏ ఇద్ద‌రు పురుషులు క‌లిసినా ఏ ఇద్ద‌రు మ‌హిళ‌లు క‌లిసినా.. `ఇది విన్నారా` అంటూ.. ఒక్క‌టే మాట‌. దేని గురించని అనుకుంటున్నారా? అదే ఓటు బ్యాంకు గురించి. అది కూడా కీల‌క‌మైన నియోజ క‌వ‌ర్గం దెందులూరు గురించే. ఇక్క‌డి మండ‌లాల్లో మ‌రీ ముఖ్యంగా పెదవేగి మండ‌లం హాట్ టాపిక్‌గా మారింది. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో అంతో ఇంతో పెద్ద మండ‌లం ఇదే. ఏ నాయ‌కుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసినా.. పెదవేగి మండ‌లంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు.


ఎందుకంటే.. ఈ మండ‌లంలో ఏకంగా 70 వేల‌పైచిలుకు ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో మ‌హిళ‌లు 38 వేల మం ది ఉన్నారు. దీంతో ఇక్క‌డ మెజారిటీ ఓట్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటే ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటారు. గ‌త 2014లోనూ ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు భారీగా ఓట్లు ప‌డ్డాయి. 2019లో అంత‌కు మించిన రీతిలో ఓట్లు వేశారు. మొత్తంగా ప్ర‌తి ఎన్నిక‌ల‌లోనూ 80-85 శాతం మంది పెద‌వేగి ఓట‌ర్లు పోటెత్తుతారు. దీంతో ప్ర‌తినాయ‌కుడు కూడా.. పెద‌వేగిపై బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తారు.


ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ పెద‌వేగికి ఇంపార్టెంట్ ఉంది. అటు టీడీపీ చింత‌మ‌నేని, ఇటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఇద్ద‌రికి ఇది సొంత మండ‌లం. ముఖ్యంగా చింత‌మ‌నేని అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి పెద‌వేగిని అస్స‌లు వ‌దిలి పెట్ట‌లేదు. ఇక్క‌డ పార్టీ కేడ‌ర్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉంటూ పార్టీని ఐదేళ్ల‌లో తిరుగులేని విధంగా పటిష్టం చేశారు. దీంతో ఇక్క‌డ మెజార్టీ ఓటు బ్యాంకు ఆయ‌నకు ఈ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప‌లికింది. మొత్తం ఈ మండ‌లం ప‌రిధిలో 28 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 18 గ్రామాలు పూర్తిగా , 8 గ్రామాలు పాక్షికంగా టీడీపీకి జై కొట్టేవి. కానీ, ఇప్పుడు 90 % గ్రామాల్లో టీడీపీకే మెజార్టీ వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


అటు చింత‌మ‌నేనితో పాటు టీడీపీ దెందులూరు కేడ‌ర్‌, అటు ప్ర‌భాక‌ర్‌పై కోట్ల‌లో బెట్టింగులు కాసిన వారంతా పెద‌వేగి మండ‌లంలో టీడీపీకి వ‌చ్చే మెజార్టీయే చింత‌మ‌నేనికి, అబ్బ‌య్య చౌద‌రికి మ‌ధ్య ప్ర‌ధాన తేడాగా నిల‌వ‌బోతోంద‌ని ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీ వాళ్లు సైతం ఒప్పుకుంటున్నారు. మ‌రి పెద‌వేగి దెందులూరులో ఎవ‌రిని హీరోను చేసి.. ఎవ‌రిని జీరోను చేస్తుందో ? వ‌చ్చే నెల 4న కౌంటింగ్‌లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: