ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తర్వాత లోకేశ్, బాలయ్య, పవన్ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా ఉండిలో రఘురామ కృష్ణంరాజు గెలిచే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చివరి నిమిషంలో టికెట్ దక్కడమే ఆయనకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ వల్లే తనకు కూటమి నుంచి నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదని రఘురామ కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
ఏపీలో కూటమి 125 నుంచి 150 సీట్లలో విజయం సాధిస్తుందని వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని రఘురామ కృష్ణంరాజు తాజాగా చెప్పుకొచ్చారు. అయితే ఉండిలో రఘురామ కృష్ణంరాజును ఓడిస్తే జగన్ ఒక విధంగా గెలిచినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీగా గత నాలుగేళ్ల నుంచి రఘురామ కృష్ణంరాజు వైసీపీపై, జగన్ పై చాలా సందర్భాల్లో ఘాటు విమర్శలు చేశారు.
 
సొంత పార్టీ ఎంపీనే జగన్ పై విమర్శలు చేస్తున్నాడనే అపకీర్తి రఘురామ కృష్ణంరాజు వల్ల జగన్ కు వచ్చింది. రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో సైతం జగన్ ను పదేపదే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఉండిలో వైసీపీ తరపున పి.వి.ఎల్‌. నర్సింహరాజు పోటీ చేశారు. వేర్వేరు కారణాల వల్ల ఈ నియోజకవర్గంలో నర్సింహరాజుకే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
రఘురామను ఓడించడానికి జగన్ చాలా వ్యూహాలనే అమలు చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. రఘురామ ఎమ్మెల్యేగా గెలవకపోతే కూటమి సైతం అతనిని పట్టుంచుకునే అవకాశాలు ఉండవు. రఘురామ మాత్రం తాను గెలుస్తానని వైసీపీ ఓటమిని కళ్లారా చూస్తానని ఆశ పడుతున్నారు. రఘురామను ఓడించే విషయంలో వైసీపీ నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభ్యర్థులకు టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: