ఆంధ్రా జనాభా మొత్తం ఇపుడు జూన్ 4వ తేదీ గురించి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నాయి. దానికి కారణం ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇంతకు మునుపు రాజకీయాలు ఒక ఎత్తయితే ఈసారి ఏపీలో రాజకీయం మరో ఎత్తు అని చెప్పుకోవాలి. ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీ గాని ఓటమి పాలు అయితే ఆ పార్టీకి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరో అయిదేళ్ళ పాటు పార్టీని నడిపించే అంగబలం, అర్ధబలం జగన్ కి ఉన్నా ఆయనకు అవకాశాలు ఎలా ఉంటాయా అన్నదే ఇపుడు చర్చ. ఇక ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు.

అవును, జగన్ కి ఇంక ఎదురులేదు అన్న సమయంలో టీడీపీకి ఊపిరి పోసి జనసేనాని పవన్ కళ్యాణ్ అడ్డంగా నిలబడ్డాడు. దాంతో జగన్ గుండెల్లో గుబులు పుట్టింది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బాబుని జైల్లో పెట్టిన జగన్ మీద ఈసారి ఎలాగన్నా కసి తీర్చుకోవాలనుకుంటోంది టీడీపీ. జగన్ మీద ఆల్రెడీ ఉన్న కేసులను వేగవంతం చేసి ఆయనను జైలుకు పంపాలని టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తుంది అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ పదేళ్లలో జగన్ పవన్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలిసినదే. ఈ విషయంలో పవన్ అస్సలు ఉపేక్షించడు అని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో పవన్ అందరిలా వయొలెంట్ పాలిటిక్స్ కాకుండా సైలెంట్ పాలిటిక్స్ చేయబోనున్నాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విషయం ఏమిటంటే... రేపటి రోజున వైసీపీ ఓటమి పాలు అయి రాజకీయంగా ఇబ్బందులు పడితే సదరు పార్టీ నేతలంతా టీడీపీ లేదంటే జనసేన వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు జనసేన వైపే మొగ్గు చూపుతారని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలోనే పవన్ రాబోయే రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతాయి అన్నది ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. వైసీపీ వీక్ అయితే ఆ ప్లేస్ లో తాము బలమైన ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందవచ్చు అనే ఆలోచనలో జనసేన ఉందని టాక్ వినబడుతోంది. దాంతోనే జనసేనాని ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు అని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: