ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. ఓవైపు  టిడిపి కూటమి మరోవైపు వైసిపి  హోరాహోరీ పోటీ పడ్డాయి.  ఇందులో మూడవ పార్టీగా కాంగ్రెస్ నుంచి వైయస్ షర్మిల అవతరించింది. కడపలో ఆమె పోటీ చేసి  అవినాష్ రెడ్డి ని ఓడించాలని కంకణం కట్టుకుంది. అలాంటి షర్మిల  అవినాష్ రెడ్డి ని ఓడిస్తుందా.. అక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనే వివరాలు చూద్దాం.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.  అలాంటి ఈ పార్టీ నుంచి ఈసారి షర్మిల పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు షర్మిల అక్కడ ఎందుకు పోటీ చేశాను అనేది కూడా ప్రచారంలో చెప్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న  అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్లే నేను పోటీలో ఉన్నానని చెప్పింది. చట్టసభల్లోకి వెళ్లేవారు నేరస్తులై ఉండకూడదని, అలాంటి వారిని ప్రజలు  దూరం చేయాలనే స్పీచ్ లు ఇస్తూ ప్రచారం సాగించింది. ఆమె ప్రచారం చేసినన్ని రోజులు న్యాయం తప్పక గెలవాలి గెలుస్తుంది అంటూ మాట్లాడింది. 

న్యాయం గెలవడం అంటే ఏంటి  ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కడపలో గెలవడమా.. లేదంటే అవినాష్ రెడ్డిని ఓడించి జగన్ కు నష్టం చేయడమా అనేది ప్రధానంగా ఉన్న అంశం. ఆమె కడపలో ఎంత అరిచినా  ఎంత సెంటిమెంటు రాజేసినా అవి ఓట్లుగా  మలచుకోవడంలో విఫలమైందని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీకే గంపగుత్తగా పడ్డాయట. ఇదే తరుణంలో ఆమె వైసీపీ ఓట్లను చీల్చడం కోసమే అక్కడ బరిలోకి దిగారని అంటున్నారు. ఎందుకంటే షర్మిల అక్కడ గెలిచిన గెలవకపోయినా పర్లేదు కానీ అవినాష్ రెడ్డిని మాత్రం ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ ప్రాంతంలో టిడిపి కూడా బలంగానే ఉంది. 1983 లో ఒకసారి గెలిచింది1996 లో గెలుపు తీరాల దగ్గరి దాకా వెళ్ళింది. అలా ప్రతి సంవత్సరం వైసిపి మెజారిటీని తగ్గిస్తూ వస్తోంది టీడీపీ. ఇక జగన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత  అక్కడ వైసిపి వేవ్ పెరిగింది. 2014,19 లో అవినాష్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి అవినాష్ రెడ్డికి పడే ఓట్లకి గండి కొడితే , అక్కడ టిడిపి గెలుస్తోందని  షర్మిల ప్లానింగ్.

ఏ ప్రభుత్వమైనా ఐదు సంవత్సరాలు పాలిస్తే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేక ఓట్లు మరియు అవినాష్ రెడ్డి పై ఆమె  చేస్తున్న ఆరోపణలు మరోవైపు తన తండ్రి పేరు చెప్పుకొని ఎన్నో కొన్ని ఓట్లను చీలుస్తుంది. దీనివల్ల అవినాష్ రెడ్డి ఓటమిపాలవుతారనేది షర్మిల యొక్క ఆలోచన.  ఆయన 2019లో 4న్నర లక్షల మెజారిటీ సాధించారు.  కానీ షర్మిల ఎంత ఓట్లను చీల్చిన రెండు మూడు లక్షల కంటే ఎక్కువ చీల్చలేదు. చివరికి లక్ష మెజారిటీతో అయినా అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది.  కానీ షర్మిల మాత్రం ఈసారి అవినాష్ రెడ్డికి ఓటమి భయాన్ని మాత్రం చూపింది అని చెప్పవచ్చు. ఒకవేళ షర్మిల ఓడిపోయిన  గెలిచినట్టే. ఆమె గెలిచినా గెలిచినట్టే.. ఇదే తరుణంలో చాలా సర్వేలు లోక్ సభ నియోజకవర్గంలో  ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసరికి వైసీపీకి వేసి ఎంపి స్థానం షర్మిలాకు వేశారనే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి జూన్ 4న ఎవరి భవితవ్యం ఏంటి అనేది బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: