- 2019లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలోనే వైసీపీ ద‌గ్గుబాటిపై సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ
- ఎలాగూ పోయే సీట‌ని వీక్ క్యాండెట్‌ను పోటీ పెట్టిన జ‌గ‌న్‌
- రికార్డు మెజార్టీతో హ్యాట్రిక్ విజ‌యం ' ఏలూరి ' సొంతం..!

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లలో బాపట్ల జిల్లాలోని పరుచూరు పేరు రాసి పెట్టుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్ సైతం వైసీపీ కచ్చితంగా ఓడిపోయే సీట్ల జాబితాలో పరుచూరును ఎప్పుడో చేర్చేసుకున్నారు. ఇక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బలం ఒక రేంజ్ లో ఉంది. ఎన్నో నియోజకవర్గాలలో.. ఎంతో మంది మహామ‌హులను సైతం తన ఈక్వేషన్లతో ఓడించిన జగన్ పరుచూరులో మాత్రం ఏలూరిని టచ్ చేయలేని పరిస్థితి. గత ఎన్నికల తర్వాత ముగ్గురు నలుగురు ఇన్చార్జిలను మార్చిన జగన్ ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి తెలియని.. ఎప్పుడో 2014లో చీరాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎడం బాలాజీని తీసుకువచ్చి పోటీ చేయించారు.


జగన్‌కు సైతం పరుచూరులో ఎంత మంచి కాండిడేట్ ను పెట్టినా వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకాలు లేవు. అందుకే జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఒక సీటు ఇవ్వాలని ఎడం బాలాజీని బలి పశువును చేశారని సొంత పార్టీ నేతలే చెవులు కోరుక్కుంటున్నారు. 2019 ఎన్నికలలో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, ద‌ర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఇద్దరు కాపు నేతలకు టిక్కెట్లు ఇచ్చిన జగన్ ఈసారి పరుచూరులో పూర్తిగా రాంగ్ ఈక్వేషన్తో బాలాజీకి సీటు ఇచ్చారు. బాలాజీకి సైతం సీటు ఇచ్చిన కొద్ది రోజులకే పరుచూరులో తన పరిస్థితి ఏంటో అర్థమై మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేదని.. పోల్ మేనేజ్మెంట్‌కు ముందు పూర్తిగా చేతులు ఎత్తేసారని వైసిపి వాళ్ళే చెప్పుకుంటున్నారు.


ఇక ఏలూరు విషయానికి వస్తే పరుచూరు నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాత్రమే కాదు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వంతుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడి పరుచూరు గడ్డ ఏలూరు అడ్డా అని ప్రూవ్ చేసుకున్నారు. 2019లో అంతటి జగన్ ప్రభంజనంలోనే కాకలు తీరిన రాజకీయ యోధుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించి జయింట్‌ కిల్లర్గా రికార్డు సృష్టించిన ఏలూరికి ఎన్నికలలో వార్‌ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది.


పరుచూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి రికార్డు మెజార్టీతో ఇంకా చెప్పాలంటే 25 వేల నుంచి 30 వేల పైచిలుకు బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని వైసిపి వాళ్ళే చెబుతున్నారు. విచిత్రమెంటంటే వైసీపీకి సానుకూలంగా వచ్చిన అన్ని సర్వేలలోనూ పరుచూరులో మాత్రం టిడిపి అభ్యర్థి సాంబశివరావు ఘనవిజయం సాధించబోతున్నారని చెబుతున్నాయి. దీనిని బట్టి పరుచూరులో ఏలూరు విజయం నల్లేరు మీద నడకే అని క్లియర్గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: