- ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగానే ఏపీలో క్లీన్ ఇమేజ్ నేత‌గా గుర్తింపు
- 2014లో వ‌చ్చిన 33 వేల మెజార్టీ ఈ సారి క్రాస్ అయ్యేనా ?
- మంత్రి కారుమూరి పోటీలో ఉన్నా జ‌గ‌న్‌కి ఆశ‌ల్లేవా ?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం గెలిచే నియోజకవర్గాలలో పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు ఒకటి. తణుకు తెలుగుదేశం పార్టీ పేరు చెపితే ఆ పార్టీ యంగ్ డైన‌మిక్ లీడ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా గుర్తుకు వస్తారు. ఆరిమిల్లి రాధా చిన్న వయసులోనే 2014 ఎన్నికలలో సింగపూర్లో ఉన్నత ఉద్యోగం వదులుకొని వచ్చి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఏకంగా 33,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించిన ఆరిమిల్లి ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీ రాజకీయాలకు దూరంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ఆరిమిల్లికి గుర్తింపు ఉంది.


ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తణుకు నియోజకవర్గాన్ని ఒక రేంజ్ లో అభివృద్ధి చేసిన ఘనత రాధాకే దక్కుతుంది. పైగా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పార్టీలు, వర్గాలు, కులాలతో సంబంధం లేకుండా యువతలో మంచి పేరు తెచ్చుకున్నారు. తణుకు నియోజకవర్గంలో సామాన్యుడికి అందుబాటులో ఉంటారన్న పేరు రాధాకు ఉంది. అందుకే గత ఎన్నికలలో అంత వైసీపీ ప్రభంజనంలోనూ రాధా కేవలం 1000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి రాధా మంత్రి హోదాలో ఉన్న వైసీపీ నేత‌ కారుమూరి నాగేశ్వరరావును ఢీకొడుతున్నారు. గత ఎన్నికలలో 1000 ఓట్లతో ఓడిన రాధా ఈసారి 2014లో వచ్చిన 33 వేల మెజార్టీని అందుకుంటారా లేదా ? అన్నది మాత్రమే చూడాల్సి ఉంది.


ఏది ఏమైనా తణుకులో మంత్రి కారుమూరిపై ఆరిమిల్లి రాధా ఘనవిజయం అయితే పక్కా నూటికి నూరు శాతం ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి జగన్ సైతం మంత్రి కారుమూరి తణుకులో గెలుస్తారు అన్న ధీమా లేకపోవడంతోనే... ఆ కుటుంబం నుంచే కారుమూరి త‌న‌యుడు సునీల్ కుమార్‌కు ఏలూరు పార్లమెంటు సీటు ఇచ్చారని వైసీపీ వాళ్లే చెవులు కోరుక్కుంటున్నారు. ఈ సారి జ‌న‌సేన స‌పోర్ట్ కూడా బ‌లంగా ఉండ‌డం.. రాధా లాంటి క్లీన్ ఇమేజ్.. ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డే యువ‌నాయ‌కుడిని వ‌దుల‌కుని.. అవినీతి కంపులో కొట్టుకుపోతున్నాం అన్న చ‌ర్చ త‌ణుకులో బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సారి త‌ణుకులో జూన్ 4న‌ రాధా గానం మోత మోగిపోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: