ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.. ఈ సారి పోలింగ్ భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఇరు పార్టీ నాయకులు, కార్య కర్తలు గెలుపుపై ఎంతో ధీమాగా వున్నారు. అయితే అధికార వైసీపీకి ఫలితాలు రాకముందే అతిపెద్ద షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి బొత్స సత్యానారాయణ రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామా లేఖ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ పాటిస్తున్న విధానాలు నచ్చకే బొత్స పార్టీని వీడనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.ఏకంగా బొత్స సత్యనారాయణ పేరుతో ఈ లేఖ బయటకు రావడంతో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు అసలు ఈ వార్త నిజమేనా..? నిజంగానే బొత్స పార్టీని వీడుతున్నారా? అని తెగ ఆరా తీశారు. దీనితో మంత్రి బొత్స అంటే పడని వారు ఇలాంటి తప్పుడు ఫేక్ న్యూస్ కొందరు సృష్టిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆ లేఖ బాగా వైరల్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఎదురు లేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వైసీపీ నేత జగన్ తన కాబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా కీలక పదవిని ఇచ్చారు.. అంతేకాకుండా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బొత్స కుటుంబంలోని ఏకంగా నలుగురికి జగన్ టికెట్లు కేటాయించారు.చీపురుపల్లి నుంచి బొత్స పోటీచేయగా, విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ అలాగే నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు మరియు గజపతినగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నరసయ్య పోటీచేశారు. ఇదిలా ఉంటే ఇటీవల బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల 4 వ తేదీన వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే నెల 9 వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఇంతలోనే ఇలా రాజీనామా లేఖ రావడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు. అయితే ఇది ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: