ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. పోలీసులు కూడా వారికి అడ్డుచెప్పకపోవడంతో మాచర్లలో హింసకు పాల్పడ్డారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 13న ఎన్నికల పోలింగ్ నాడు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసాయి. మాచర్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని 202నెంబర్ గల పాల్వాగేట్ పోలింగ్ కేంద్రంలో లోపలికి వెళ్లి చేసిన పని పోలింగ్ సిబ్బందిని అవాక్కయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఇవిఎమ్‌లు ధ్వంసం చేస్తున్న వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్‌పైనా ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ దృశ్యాలన్ని వెబ్‌ క్యామ్‌లో రికార్డ్ కాగా.. సిట్‌ దర్యాప్తులో అవి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తతం అందుకు సంబంధించిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈవీఎంల ధ్వంసంపై కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల పరిధిలో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు ఈసీకి పోలీసులు తెలియజేశారు.ఈ నేపథ్యంలో అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గృహ నిర్బంధం నుంచి గన్‌మెన్‌లను వదిలి హైదరాబాద్‌కు వెళ్లాడని టిడిపి ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్‌ కానీ, సిట్‌ దర్యాప్తు అధికారులు కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

అయితే పోలింగ్ సరళిని పరిశీలించడానికి ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఆ కెమెరాలలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తరువాత పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టిడిపి, వైసిపి నేతల మధ్య దాడులు కొనసాగాయి.కర్రలు,రాడ్లు, రాళ్లు, పెట్రోలు బాంబులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇక మాచర్లలో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆ రోజున ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తరువాత జరిగిన అల్లర్లపై పోలీసుల విచారణ ప్రారంభం కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా ఈ వీడియో బయటకు రావటంతో ఇది చూసిన రాష్ట్ర ప్రజలు అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: