ఆంధ్రప్రదేశ్ : ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్‌పైనే నెలకొంది. జూన్4 కోసం ఆంధ్రా ప్రజలు నిరీక్షిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ గ్రామంలో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి.. ఏ గ్రామంలో వ్యతిరేకంగా పడ్డాయో తెలుసుకున్నారు. ఓవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమకు మెజార్టీ సీట్లు వస్తాయని 151 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మాటలపై నమ్మకంతో జూన్‌9న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే మెజార్టీ సీట్లు కూటమికి వస్తాయని సమాచారం తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో వైసీపీ పక్కా విన్ అవుతుంది. ఈ క్రమంలో 151 సీట్లు వస్తాయంటూ జగన్ తెలపడం హాట్ టాపిక్ అవుతుంది.


పోలింగ్ తర్వాత వినిపిస్తున్న ప్రజల నాడికి టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. వాస్తవానికి పేద, మధ్య తరగతి మహిళలు, వృద్ధుల ఓట్లు ఏకపక్షంగా తమకు పడతాయని వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనకి తగ్గట్లే ఓట్లు పడ్డాయని సమాచారం తెలుస్తుంది.పోలింగ్ సరళి, ఓటింగ్ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటుంటే  మహిళల ఓట్లు మాత్రం ఏకపక్షంగా వైసీపీ పార్టీకి పడ్డాయని తెలుస్తుంది. కూటమికి, వైసీపీకి చెరి సమానంగా మహిళల ఓట్లు చీలిపోయినట్లు అనుకున్నారు కానీ అలా జరగలేదని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తేలింది. అయితే వృద్ధుల్లో ఎక్కువ శాతం ఓట్లు వైసీపీకి పడినప్పటికీ.. యువత, ఉద్యోగస్తుల ఓట్లు వైసీపీ కంటే కొంచెం ఎక్కువగా టీడీపీకి కూటమికి పడ్డాయని ఇండియా హెరాల్డ్ ప్రతినిధులు సేకరించిన సమాచారంలో తేలింది. దీంతో గెలుపు అవకాశాలు టీడీపీ కూటమి కంటే వైసీపీకే ఉన్నట్లు గ్రామాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ గా వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: