ఆంధ్రప్రదేశ్‌ లో జూన్‌ 4న వెలువడబోతున్న ఎన్నికల ఫలితాల కోసం యావత్ ఆంధ్రా ప్రజలంతా చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముంది ఎన్నికలు ఒకలెక్క, ఈసారి ఎన్నికలు ఓ లెక్క. ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనేదానిపై ఇపుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున బెట్టింగులు సాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఓవైపు వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ తమ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువగా గెలుస్తుందని ప్రకటించగా మరోవైపు అధికారం చేపట్టబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమేనని టీడీపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు.

ఇక వైసీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివారు అయితే ఈపాటికే విశాఖ నుంచే జగన్‌ పరిపాలిస్తారని, జూన్‌ 9న విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం ఉంటుందని కూడా వెల్లడించారు. అదే మాదిరి టీడీపీ నేతలు దేవినేని ఉమా, రఘురామకృష్ణరాజు కూటమి అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. దీంతో ప్రమాణస్వీకారం అమరావతికి దక్కుతుందా? లేక విశాఖపట్నానికి దక్కుతుందా? అన్న ఈ రెండింటిలో ఏది ఖాయమవుతుందా అని జనాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని గట్టిగా చెబుతుంటే.. మరికొన్ని కూటమికి గెలుస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. ఇక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అయితే వైసీపీకి ఓటమి తప్పదంటూ పలుమార్లు గట్టిగా మీడియా ముందు వాదించి మరీ చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరికి మెజారిటీ స్థానాలు దక్కుతాయో తెలియాలంటే జూన్‌ 4 వరకు ఎదురుచూడక తప్పదు. ఈలోపు మీరు ఒక ఓటరుగా ఏమంటుకుంటున్నారో, ఏ పార్టీ వస్తే మీకు మేలు చేకూరుతుంది అని భావిస్తున్నారో ఇక్కడ కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: