ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తాయి దీని తర్వాత ఎవరు లెక్కలు వారు వేసుకున్నారు. వారి వారి లెక్కల ప్రకారం తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ప్రకటించుకున్నారు. జగన్ 150కి పైగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు చారి తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు  అయితే ఏ లెక్కన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పోలింగ్ సరళిని, బలాబలాలను సమీక్షించారనేది మాత్రం తెలియ రాలేదు. ఇటీవల చంద్రబాబు సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే దానికంటే ముందు ఆయన టీడీపీ తమ్ముళ్లకు మనమే గెలుస్తాం అని చెప్పి వెళ్లారు. అయితే వారిలో నమ్మకం కలిగించడానికి ఎలాంటి సమీక్ష చేశారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇన్సైడ్ ప్రకారం, చంద్రబాబు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి 130 స్థానాలకు తగ్గకుండా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పారట. ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగులందరూ టీడీపీ వారికి ఓట్లు వేశారు అని చంద్రబాబు తన కింద స్థాయి నాయకులకు నమ్మకంగా చెప్పారని తెలిసింది. ఉద్యోగులు వారి కుటుంబాలు అలాగే వారి వల్ల ఇతరులు కూడా తమకు ఓట్లు వేశారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారట. జనసేన, టీడీపీ, బీజేపీ - ఈ మూడు పార్టీలు వాళ్లు సంక్షేమ పథకాలు తీసుకున్న తర్వాత కూడా కూటమికే వేశారని చంద్రబాబు నమ్ముతున్నారు.

న్యూట్రల్ గా ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో టీడీపీ సక్సెస్ అయిందని ఆ ఓట్లు కూడా తమకే పడి ఉంటాయని బాబోరు తమ్ముళ్లకు తెలియజేశారట. వైసిపి అరాచక పాలన గురించి చెప్పి చాలామందిని తమవైపే తిప్పుకోగలిగామని ఆ ఓట్లే సీట్లు గెలవడానికి కీలకంగా మారనున్నాయని కూడా తెలిపారట. సంక్షేమ పథకాలు కోసం వైసీపీకి ఓటు వేయాలనుకున్నవారు టీడీపీ+ మేనిఫెస్టో చూశాక ఆ నిర్ణయం మార్చుకున్నారని చంద్రబాబు టీడీపీ నేతలతో అన్నారట. రెండు కోట్ల మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వారిలో ఒక కోటి 50 లక్షల మంది తమ మేనిఫెస్టో చూశాక ఆ సంక్షేమ పథకాల కోసం తమకే ఓట్లు వేసి ఉంటారని చంద్రబాబు లెక్క వేశారు.

మొత్తం లెక్క చేసి చూస్తే ఒక కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఓట్లు టిడిపికే కచ్చితంగా పడి ఉంటాయని చంద్రబాబు ఒక అంచనాకి వచ్చారు. 50% ఓట్లు  మనకే వచ్చాయి అంటూ, 130 నుంచి 140 సీట్లు గెలుచుకోవడం కాయమంటూ టీడీపీ తమ్ముళ్లకు చెప్పి చంద్రబాబు సింగపూర్ వెళ్లిపోయారట. ఈ సీక్రెట్ లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇవి నమ్మేలా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే చంద్రబాబు నమ్మకంగా వేసిన లెక్కలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: