•అనకాపల్లిలో కుబేరుడు సీఎం రమేష్ కి గెలుపు పక్కా

•బీజేపీ చేతిలో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం


అనకాపల్లి - ఇండియా హెరాల్డ్: అనకాపల్లి జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 12.73 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 6.20 లక్షల పురుషులు, 6.53 లక్షల మహిళలు ఉన్నారు. 1962లో ఏర్పాటైన ఈ పార్లమెంట్ స్ధానానికి ఇప్పటి దాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెలుగుదేశం ఇంకా ఒకసారి వైఎస్సార్సీపీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేశారు. రమేష్ కి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సీఎం రమేష్‌, జాతీయ పార్టీ బీజేపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టాలని వ్యూహాత్మకంగానే అనకాపల్లి స్థానాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఈ జిల్లాలో తన సామాజికవర్గానికి ఉన్న పట్టుతో, రాజకీయ చతురతతో అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొంటూ ముందుకెళ్లారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎం రమేష్ కోసం ప్రచారం చేశారు. బాగా డబ్బున్న కుబేరుడు. ఈయన ఖచ్చితంగా తమకు మేలు చేస్తారాని అనకాపల్లి ప్రజలు నమ్మకంతో ఈయనకి ఓట్లు బాగా వేసినట్టు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.


ఇక వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పోటీ చేశారు. మాడుగులలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యాల నాయుడు ఈసారి తనను లోక్‌సభకు పంపాలంటూ ప్రచారం చేసుకోవడం జరిగింది. కనీస మరమ్మతులు లేని రోడ్లు, నిర్వహణలోపం, విద్య, వైద్య కళాశాల నిర్మాణం, పరిశ్రమలు ఇంకా ఉపాధి అవకాశాలు తేవడంలో విఫలం కావడం వంటివి వైఎస్సార్సీపీకి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఈయన గెలిచే ఛాన్స్ లేదు. మరోవైపు ప్రజలు అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని సీఎం రమేష్‌ హామీ ఇవ్వడం వల్ల ప్రజలు ఈయనకే ఓట్లు ఎక్కువ వేసినట్టు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.కాబట్టి అనకాపల్లిలో ఈసారి పక్కాగా సీఎం రమేష్ విజయం సాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: