ఏపీ ఎలక్షన్స్ అంటేనే ఎప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఎలక్షన్ రిజల్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు..ఎవరు ఓటమిపాలవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో ఎన్నో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఇందులో కొన్ని వైసీపీ గెలుస్తుంది అంటే మరికొన్ని టిడిపి కూటమి అధికారంలోకి వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పటివరకు టిడిపి కూటమికి సంబంధించి ఎవరు కూడా మేమే గెలుస్తామని బాహాటంగా చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లెక్కలేసుకొని పక్కాగా 151 పైగా అసెంబ్లీ గెలుస్తామని, 22 పార్లమెంటు స్థానాల్లో మా జెండా ఎగురుతుందని క్లారిటీగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన లండన్ లో చిల్ అవుతున్నారు. ఇదే తరుణంలో ఎలక్షన్స్ ముగిసాక చాలా సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేదానిపై కొన్ని సర్వేలు కూడా చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా వైసిపి హయాంలో మంత్రి పదవులు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ప్రముఖులు ఈసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రముఖులకు ఓటమి తప్పదని తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రముఖులు ఎవరు.. వారి ఓటమికి కారణాలేంటో చూద్దాం..

 రోజా:
 నగరి నియోజకవర్గం పేరు చెప్పగానే రోజా పేరు గుర్తుకు వస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఈమెకి ఓటమి తప్పదట. దీనికి ప్రధాన కారణం నగరిలో ఆమెకు వ్యతిరేకత ఉందని  వైసీపీ క్యాడర్ స్వయంగా జగన్ చెప్పారట.  వారు ఈమెకు టికెట్ ఇవ్వద్దని ముందే చెప్పిన జగన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఈసారి ఆమె ఓటమి తప్పదని అంటున్నారు.
 అంబటి రాంబాబు:
 వైసిపి కీలక నేత అంబటి రాంబాబు కూడా ఈసారి సత్తెనపల్లిలో ఓడిపోయే అవకాశం ఉందట. ఈయనకు సొంత పార్టీ వ్యతిరేకత ఉందట. అక్కడ టిడిపి కూటమి నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఈసారి టిడిపి జనసేన కలుస్తుంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం కనిపిస్తోంది.
 గాజువాక:
ఈ నియోజకవర్గంలో కూడా గుడివాడ అమర్ నాథ్ కు  వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
 గన్నవరం:
 వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు టిడిపి నుంచి గెలిచారు. ఈయన ఈసారి వైసిపి లోకి వచ్చి గన్నవరం నుండి పోటీ చేశారు.కానీ ఈసారి వంశీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 
 తణుకు:
కార్మూరు నాగేశ్వరరావు ఈసారి వైసిపి నుంచి పోటీ చేశారు. ఈయనకు కూడా గెలుపు అవకాశాలు దాదాపుగా లేనట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 గోపాలపురం:
 హోంమంత్రి తానేటి వనిత ఈసారి గోపాలపురం నియోజకవర్గం లో ఓడిపోతుందని తెలుస్తోంది. ఇక్కడ మద్దిపాటి వెంకట్ రాజుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
 గుంటూరు పశ్చిమ:
విడదల రజిని గుంటూరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె కూడా ఈసారి ఓడిపోయా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: