ఏపీలో మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం జగన్ లో ఉంది. వైసీపీ నేతలు సైతం రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీదే అధికారమని ఫీలవుతున్నారు. అయితే బెట్టింగ్స్ ట్రెండ్ మాత్రం జగన్ కు పూర్తిస్థాయిలో అనుకూలంగా లేదు. బెట్టింగ్ రాయుళ్లు కూటమిని నమ్మిన స్థాయిలో జగన్ ను నమ్మడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీడీపీ నేతలు వైసీపీ నేతలకు ఫోన్లు చేసి మరీ సవాళ్లు విసురుతున్నట్టు తెలుస్తోంది.
 
బెట్టింగ్స్ కు సంబంధించి టీడీపీ నేతలు ధీమాగా ఉంటే వైసీపీలో మాత్రం ఆ ధీమా అస్సలు కనిపించడం లేదు. టీడీపీ సానుభూతిపరులు సైతం ఈ విధంగా వైసీపీని టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వైసీపీ చరిత్ర తిరగరాస్తుందని చెప్పిన తర్వాత టీడీపీ సైతం ఫలితాల విషయంలో ఒకింత టెన్షన్ పడుతోందని తెలుస్తోంది.
 
బెట్టింగ్ విషయంలో వైసీపీ నేతలు ఆసక్తి కనబరచకపోయినా అధికారం తమదే అని మాత్రం చెబుతున్నారు. 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని సొంత పార్టీ నేతలే నమ్మలేని పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే నాలుగో తేదీ ఫలితాల రూపంలో ఏ పార్టీ నేతల నమ్మకం నిజం కానుందో తేలిపోనుంది. జగన్ సీట్ల విషయంలో విశ్వసనీయత నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
 
వైసీపీ అధికారంలోకి వస్తే చాలని చాలామంది వైసీపీ నేతలు ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. ఏపీ పోలింగ్ తర్వాత జగన్ చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశాలు తక్కువని వైసీపీ నేతలలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం తమకే అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని చాలామంది కూటమి  నేతలు ఫీలవుతున్నారని తెలుస్తోంది. జగన్ నమ్మకం నిజమవుతుందో కూటమి లెక్కలు నిజమవుతాయో తెలియాలంటే మాత్రం మరి 10 రోజులు వేచి చూడక తప్పదు.
మరింత సమాచారం తెలుసుకోండి: