ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లు కుండబద్దలు కొట్టి చెపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఐప్యాక్ తో వైసిపి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ... తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆ మాటలు నమ్మడం లేదు. పూర్తి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కూడా పెడుతున్నారు. సీట్ల సంఖ్యతో పాటు... మంత్రివర్గ విస్తరణ కూడా చేసేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకంగా 130 పైచిలుకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. అంతేకాదు... చంద్రబాబు నాయుడు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వెల్లడించారు. ఇక చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి... ఈ బాధ్యతలను దగ్గరుండి నిర్వహిస్తారని వివరించారు.

చంద్రబాబు నాయుడు ఏ రోజున ప్రమాణం స్వీకారం చేయాలనే దానిపై... నారా భువనేశ్వరి మంచి ముహూర్తం పెడతారని కూడా బుద్ధ వెంకన్న కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు మే 13వ తేదీన చాలా ఉద్రిక్తత నడుమ జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో గొడవలు జరిగాయి.

వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా కార్యకర్తల మధ్య దారుణమైన కొట్లాట జరిగింది. ముఖ్యంగా చంద్రగిరి, మాచర్ల నియోజకవర్గం, పల్నాడులోని మిగతా ప్రాంతాలు, అనంతపురం జిల్లా, అటు విశాఖలో కూడా చాలా చోట్ల సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఏది ఏమైనా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసిపి మధ్య బంధం తెగిపోయిందని... అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని తెలుగు తమ్ములు అంటున్నారు. ఇక చాలా సర్వేలు కూడా తెలుగు దేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఫలితాలు కూడా ఇచ్చాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: