వైఎస్‌ జగన్‌ కి వ్యతిరేకంగా, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా మారి చాలా రచ్చ సృష్టించారు రఘురామకృష్ణంరాజు. ఈ వైసీపీ మాజీ ఎంపీ గత ఐదేళ్లుగా జగన్‌పై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ హైకమాండ్‌పై బురద జల్లుతూ ఆ పార్టీకి పూర్తిగా దూరమైపోయారు. వైసీపీ కూడా ఆయనను బాగానే ఇబ్బందికి గురి చేసింది. ఏపీకి రావడానికి ట్రై చేసిన రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ చేత అరెస్టు చేయించింది. ఆపై చిత్రహింసలకు గురిచేసి ఆయనకు చుక్కలు చూపించింది.

 రఘురామకృష్ణంరాజు వైసీపీ పై చేసిన విమర్శలు, ఇతరత్రా చెడు కార్యాలకు తగిన ఫలితాన్ని అనుభవించారు. అయితే ప్రతీకారం తీర్చుకునేందుకు  సరైన సమయం కోసం ఓపికగా వెయిట్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి వైసీపీకి పూర్తి ప్రత్యర్థిగా మారిపోయారు. అతను టీడీపీ తరఫున గెలిచే కంచుకోట అయిన ఉండీ సీటును దక్కించుకోగలిగారు, అక్కడ టిడిపికి బాగా ఓటు పడే అవకాశం ఉంది కాబట్టి రఘురామకృష్ణంరాజు అతను భారీ ఆధిక్యంతో విజయం సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయం ఖాయం అనుకుంటున్నారు అది పక్కన పెడితే, కూటమి గెలిస్తే ఈ వైసీపీ రెబల్ నాయకుడికి ఎంత పెద్ద పదవి ఇస్తారు అనే ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి. కేబినెట్ బెర్త్‌ అతనికి కచ్చితంగా దక్కుతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ను ఏపీ స్పీకర్‌గా నియమించవచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి, అయితే ఇది ఏం పాత న్యూస్. కొత్త న్యూస్ ఏంటంటే చంద్రబాబు rrr ని హోం మంత్రి కుర్చీలో కూర్చోబెట్టొచ్చని కాకినాడ వస్తోంది. హోం మంత్రి పదవి అంటే మామూలుది కాదు. ఆ పదవి ఈ రెబల్ ఎంపీకి తగ్గితే ఆయన కంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టే ఆయన పరిస్థితి అవుతుంది.

 RRR హోం మంత్రిగా మారితే, పూర్తి స్వేచ్ఛగా తిరగవచ్చు. తనని ఇబ్బంది పెట్టిన వారి ముందే ఆయన కాలర్ ఎగరేసుకొని షికారు చేయవచ్చు. జగన్ ముందు అవహేళనగా నవ్వుతూ ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు. కానీ ముందుగా టిడిపి కూటమి గెలవాలి. రఘురామకృష్ణంరాజు టీడీపీ + కచ్చితంగా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 తర్వాత వైసీపీ పార్టీ ఉనికి లేవు లేకుండా పోవడం స్టార్ట్ కావడం ప్రారంభమవుతుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: