సినిమాలు, రాజకీయాలకు సంబంధించి నూటికి నూరు శాతం అంచనాలు ఎప్పుడూ నిజం కావు. కచ్చితంగా విజయం సాధిస్తారని చాలామంది భావించిన అభ్యర్థులు సైతం ఓటమిపాలైన సందర్భాలు ఉన్నాయి. పిఠాపురంలో పవన్ గెలుస్తాడంటూ సర్వేలు చెబుతున్నా గెలుపు విషయంలో పవన్ ను ఒకింత వెంటాడుతోంది. పిఠాపురంలో ఊహించని ఫలితం రాబోతుందని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.
 
అయితే వంగా గీత బలం ఏంటి ? పవన్ బలహీనతలు ఏంటి? అనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లు అధికంగా ఉన్నారనే కారణంతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అయినా పొలిటికల్ గా ఆయనకు అనుభవం మాత్రం లేదనే సంగతి తెలిసిందే. పవన్ నాన్ లోకల్ కావడం ఆయనకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు.
 
వంగా గీత విషయానికి వస్తే ఆమెకు అపార రాజకీయ అనుభవం ఉండటంతో పాటు ఆమె న్యాయశాస్త్ర పట్టభద్రురాలు, ఉన్నత విద్యావంతురాలు కావడం గమనార్హం. వంగా గీత లోకల్ కావడంతో ఆమెకు ప్రజల్లో మంచి పేరు ఉంది. పిఠాపురం అభివృద్ధి కోసం ఆమె గతంలో చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలే ఆమెకు బలంగా ఉన్నాయి.
 
వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. పిఠాపురంలో గతంతో పోల్చి చూస్తే ఓటింగ్ శాతం పెరగగా వైసీపీ సంక్షేమం, అభివృద్ధి వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని టాక్ ఉంది. వంగా గీత ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం జనసేన పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వంగా గీత గెలిస్తే మాత్రమే పిఠాపురం ప్రజలకు మరింత మెరుగ్గా పాలన అందుతుందని పొలిటికల్ వర్గాల్లో సైతం వినిపిస్తోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: