ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లోగా రానున్నాయి. శనివారం రోజున దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఆరవ విడత పోలింగ్ జరుగుతోంది. మరో విడత జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటు ఏపీ ఫలితాలు కూడా వస్తాయి. అయితే ఏపీ ఫలితాలు రాకముందే... తమదంటే తమదే గెలుపు అంటూ సోషల్ మీడియాలో అలాగే మీడియా ముందు వైసీపీ నేతలు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు రచ్చ చేస్తున్నారు.

తెలుగుదేశం కూటమికి 130 కి పైగా సీట్లు వస్తాయని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటే... వైసీపీకి 175 సీట్లు వస్తాయని వెల్లడిస్తున్నారు వైసిపి నాయకులు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ మాజీ నేత రఘురామకృష్ణరాజు సంచలనం వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని ఆయన వెల్లడించారు.

ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ ఓడిపోతే... జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అసలు అడుగు పెట్టబోరని బాంబు పేల్చారు రఘురామకృష్ణరాజు. పార్టీ ఓడిపోయిన అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి భరించలేడని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి... జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడని... అతని స్వభావం చాలా డిఫరెంట్ గా ఉంటుందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా కాలం గడిపేస్తాడని తెలిపారు.

అయితే ఒకవేళ వైసీపీ పార్టీ నిజంగానే ఓడిపోతే... కొన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవచ్చు అని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత పరిస్థితులు చెక్కబడ్డ తర్వాత... మళ్లీ జగన్మోహన్ రెడ్డి యధావిధిగా అసెంబ్లీకి వెళ్లి... వైసిపి పార్టీని మరింత బలోపేతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదే విషయాన్ని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. జగన్ అసలు వెనక్కి తగ్గడానికి... ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే సాధిస్తాడని ఇప్పటికే ఒక పేరు ఉంది. 151 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి... మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: