జీతాలు, పెన్షన్లు, ఏరియర్స్‌ తదితర విషయాల్లో జగన్ ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచలేక పోయింది ఆ కారణంగా ఎంప్లాయిస్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. జీతాల విషయంలో జగన్ ప్రభుత్వం కనీసం ఎలాంటి చర్చలు కూడా జరపలేదని ఉద్యోగులందరూ ఫైర్ అయ్యారు. ఇక తర్వాత పెంచుతారని ఆశించిన బెనిఫిట్స్ ను జగన్ తగ్గించారు. దీనివల్ల ఉద్యోగులు వైసీపీ సర్కారుపై పూర్తిగా వ్యతిరేకత పెంచుకున్నారు. దీని తర్వాత జీతాలు లేట్ అవ్వడం వంటి సమస్యలు కూడా ఉద్యోగులను బాగా ఆగ్రహానికి గురిచేసాయి. అందుచేత గవర్నమెంట్ ఎంప్లాయిస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి ప్రతి నిమిషం కూడా ప్రయత్నిస్తున్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోను కూడా వారే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఆల్రెడీ ఈ వీడియోను తాము బయట పెట్టలేదని స్పష్టంగా వెల్లడించింది. సో ఈ పని ఉద్యోగులత అయ్యుంటుందని స్పష్టంగా అర్థం అవుతుంది వారు వైసీపీను ఓడిపోవాలని ప్రయత్నాలు చేయడమే కాకుండా టీడీపీ వారికి సపోర్టు పలుకుతున్నారు. పోలింగ్ తేదిన గొడవలు జరగడానికి కూడా ఎంప్లాయిస్ యే కారణమని తెలుస్తోంది. వారి టిడిపి వాళ్లకి అన్ని విధాల సహకరించారు వైసిపి వాళ్లపై దాడులు చేసేలా ప్రేరేపించారు. తాము వెన్నంటే ఉన్నాం అంటూ టీడీపీ గుండాలను వైసీపీ నేతలపై ఉసిగొలిపినట్లు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మిగతా ఉద్యోగులతో సహా పోలీసులు టీడీపీ మాత్రమే గెలవాలని భావిస్తూ పూర్తి సహకారం అందించారు. పోలీసు వ్యవస్థను మొత్తం టీడీపీ కొమ్ముకాసింది. వైసీపీ పార్టీకి ఓట్లు పడకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూశారు తప్ప ఆపలేదు. జోక్ ఏంటంటే వాళ్ళే సీసీటీవీ కెమెరాలను పగలగొట్టి పోలింగ్ బూతు లోపలికి టీడీపీ గుండాలను వదిలారు. మొత్తం మీద టిడిపి వారికి బాగా సపోర్ట్ చేస్తూ వారే గెలిచేటట్టు వీరు ప్రవర్తించారు. కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే వారికి మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: