2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు జగన్ ముఖ్యమంత్రిగా పెద్దగా ఇబ్బందులు పడకుండానే అద్భుతంగా పాలన సాగించారంటే సలహాదారులు, జగన్ నమ్మిన వ్యక్తులు ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటు అండగా నిలవడం కారణమని చెప్పవచ్చు. జగన్ అత్యంత నమ్మదగిన వ్యక్తులలో వైవీ సుబ్బారెడ్డి ఒకరు కాగా వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బంధువు కావడంతో పాటు ఆత్మ బంధువు కూడా కావడం గమనార్హం.
 
ఎవరైనా జగన్ పై విమర్శలు చేస్తే వైవీ సుబ్బారెడ్డి అస్సలు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు కాగా జగన్ కు వైవీ సుబ్బారెడ్డి వరుసకు బాబాయ్ అవుతారు. వైవీ సుబ్బారెడ్డి 2014 సంవత్సరంలో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా రెండుసార్లు పని చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డిపై కొన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోలేదు.
 
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అటు షర్మిల కానీ ఇటు కూటమి నేతలు కానీ జగన్ పై విమర్శలు చేస్తే వైవీ సుబ్బారెడ్డి తనదైన శైలిలో జవాబులు ఇస్తున్నారు. 2024లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ప్రమాణ స్వీకారం డేట్, టైమ్ ఇవేనంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. జగన్ పై ఈగ కూడా వాలనివ్వని నేతగా వైవీ సుబ్బారెడ్డి మంచి పేరును సొంతం చేసుకున్నారు.
 
ఐదేళ్ల పాటు జగన్ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేయడంలో, అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర కచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తే ధీటుగా బదులిచ్చే ప్రతిభ కూడా వైవీ సుబ్బారెడ్డి సొంతం అని చెప్పవచ్చు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు మరిచిపోరని వివేకా హత్య వెనుక ఎవరు ఉన్నారో కోర్టులు తేలుస్తాయని వైవీ సుబ్బారెడ్డి షర్మిలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: