ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్కు కుడి భుజం లాగా ఉంటూ చాలామంది సహకరించారు. ఈ సలహాదారులు కారణంగా ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన అందించగలిగింది ప్రతి ప్రజలకు మేలు చేయగలిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగింది. జగన్ ఇంజన్ అయితే వీరు చక్రాల వలె రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీయించారు. వారిలో అజయ్ కల్లమ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక వారితో పాటు ఎనర్జీ అడ్వైజర్ అజయ్ కళ్ళం కూడా మంచి సలహాదారుగా పనిచేస్తూ వచ్చారు.

ఎనర్జీ సెక్రటరీ అజయ్ జైన్ చాలా ఏళ్లుగా ఏపీలో విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన కీలక బాధ్యతలను వహిస్తున్నారు. సోలార్, పవన విద్యుత్తుల ప్రాజెక్టులపై కూడా ఆయన ఎన్నో మంచి సలహాలను అందజేశారు. ఎనర్జీ పరంగా ఏపీ మంచి అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత అజయ్ జెన్‌కే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఏపీ సీఎం జగన్‌కు నమ్మినబంటుగా ఆయన పని చేస్తూ వస్తున్నారు. ఎకో నివాస్‌ సంహిత పేరిట చాలామందికి తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగు, ఎలక్ట్రిసిటీ వచ్చే ఇళ్ల ప్రాజెక్టులను కూడా చాలా చక్కగా అమలు చేశారు. దీని ద్వారా జగన్ కి మంచి పేరు తీసుకొచ్చారు. ఏపీ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సీఎస్ గా కూడా పనిచేసిన అజయ్ జైన్ రాజధాని ఏర్పాటులో కూడా కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు.

 రాష్ట్రానికి ఎనర్జీ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమీ లేదని టిడిపి జనసేన పార్టీ నేతలు దారుణమైన విమర్శలు చేస్తుంటే.. వాటిని జగన్ తరుపున సమర్థవంతంగా తిప్పి కొట్టారు అజయ్ జైన్. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం చేపట్టి గా పని చేసిన వారికి పురస్కారాలు, సేవా రత్నా బిరుదులను కూడా అందజేశారు. ఏపీలో ప్రతి మూలాహం ఎల్ఈడి లైట్ ని తీసుకొచ్చి విద్యుత్తు ఆధార్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. జగన్ తీసుకొచ్చిన పథకాలను చాలా చక్కగా అమలు చేస్తూ ప్రజలకు ఎంతో మేలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: