ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలబడతాయి. ఇందుకోసం ఏపీ ప్రజలు మొత్తం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. గెలుపు పైన ఇరువురి పార్టీ నేతలు కూడా దీమాని వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. అయితే పోలింగ్ తర్వాత ఓటర్లు నాడీ ఎలా ఉందనే విషయం పైన రాజకీయ నాయకులకు కూడా అంత చిక్కడం లేదట.


అయితే ఇప్పటివరకు చాలా సర్వేలు అన్నీ కూడా వైసిపి పార్టీకి అనుకూలంగానే తెలియజేశాయి.మరికొన్ని కూటమి అధికారంలోకి వస్తుందంటూ తేల్చాయి. ఫలితాల ముందే టిడిపి డైలమాలో పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత విజయం పైన గట్టి నమ్మకంతో ఉన్న చాలామంది తెలుగు తమ్ముళ్లు కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరుత్సాహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.. పక్కాగా గెలిచే సీట్లలో ఓడిపోతారేమో అనే బాధ కూడా టిడిపి నేతలలో కనిపిస్తోందట. ఇందుకు టిడిపి రెబల్స్ కారణం అన్నట్లుగా సమాచారం.


టికెట్ దక్కకపోవడంతో కొంతమంది టీడీపీ నేతలు స్వాతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్లు వేశారు. ఎప్పుడు ఇదే టిడిపి పార్టీని కలవరపెట్టడానికి కారణమయ్యింది. అరకు నియోజవర్గానికి చెందిన సివేరి అబ్రహం.. అమలాపురం నియోజవర్గానికి చెందిన పరాయట శ్యాం కుమార్, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, విజయనగరానికి చెందిన మీసాల గీత, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్ ఇతరత్న నేతలు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

దీంతో ఈ నియోజకవర్గాల ఫలితాల పైన టిడిపి నేతలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. రెబల్గా పోటీ చేసిన అభ్యర్థులు ఎంతవరకు ఓట్లు గెలిచారు అనే విషయం టిడిపి నేతలు లెక్క వేసుకుంటున్నారు. చాలామంది టిడిపి రెబల్స్ కి ఓటు పడ్డాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సీట్ల పైన టిడిపి పెద్దగా గెలుపు నమ్మకం పెట్టుకోలేదని తెలుస్తోంది. మరి టిడిపి పార్టీ గెలుపు పైన రెబెల్స్ ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: