- న్యూస్ 18 - టైమ్స్ నౌ వైసీపీకే జై
- మ‌హిళ‌లు, వృద్ధులే కీల‌క‌మ‌న్న ఎన్డీటీవీ

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ఎన్నిక‌ల వేడిని పెంచ‌డంలోనూ.. ప్ర‌జా నాడిని మ‌రింత టెన్ష‌న్కు గురి చేయ‌డంలోనూ.. జాతీయ మీడి యాది ఒక లెక్క‌. చేసేది త‌క్కువ స‌ర్వేనే అయినా.. క్షేత్ర‌స్తాయిలో బ‌ల‌మైన ప్ర‌జానాడిని ప‌ట్టుకోవ‌డంలో జాతీయ మీడియా ముందుంది. అన్ని ర‌కాల సంస్థ‌లు కూడా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనా దృష్టి పెట్టాయి. ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్‌డీటీవీ, టైమ్స్ నౌ, జ‌న్‌మ‌త్‌, న్యూస్ 18, చాణ‌క్య త‌దితర స‌ర్వేలు ఏపీలో సాగాయి.


అనేక స‌ర్వేలు చెప్పింది.. ఒక్క‌టే.. కూట‌మి బ‌ల‌మైన పోటీ ఇస్తున్న‌ట్టు చెప్పాయి. నిజానికి బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసిన త‌ర్వాత కూడా.. ఇక్క‌డ‌.. ఇంకా పోటీ ఉత్కంఠ‌గానే ఉంద‌ని చెప్ప‌డంలో జాతీ య స‌ర్వేలు ముందున్నాయి. ఏ పార్టీ వ‌స్తుంద‌నేది చెప్ప‌క‌పోయినా.. అధికారంలోకి వ‌చ్చే పార్టీకి మ‌హిళ లు, వృద్ధుల ఓటు బ్యాంకు కీల‌కంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఇమేజ్ విష‌యంలో జాతీయ స్థాయి స‌ర్వేలు చెప్పింది.. గ్రామీణ ప్రాంతాల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉందని.


ఇదే విష‌యాన్ని స్థానికంగా ఉన్న అనేక స‌ర్వేలు కూడా చెప్పుకొచ్చాయి. అంతేకాదు... న్యూస్ 18 వంటివి జ‌గ‌న్ వైపు మొగ్గు చూపాయి. కానీ, ఎన్డీటీవీ వంటివి మాత్రం ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాయి. ఎవ‌రికి మొగ్గు అనే విష‌యాన్ని తేల్చ‌కుండా.. మ‌హిళ‌లు, వృద్ధులు ఎటు వుంటే అటే ప్రభుత్వం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, కూట‌మి పార్టీల‌కు మైనారిటీ ఓటు బ్యాంకు పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని.. టైమ్స్ నౌ ప‌త్రిక అంచ‌నా వేసింది.


ఫ‌లితంగా కూటమికి ఇబ్బంది త‌ప్ప‌ద‌ని కూడా.. ఈ సంస్థ అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం. జాతీయ స్తాయి లో టైమ్స్ నౌ అంచ‌నా ప్ర‌కారం.. ఏపీలో వైసీపీ స‌ర్కారు మ‌రోసారి కొలువు దీరే అవ‌కాశం ఉంద‌ని తెలు స్తోంది. ఇత‌ర సంస్థ‌లు పెద్ద‌గా అంచ‌నా వేయ‌క‌పోయినా.. చూచాయ‌గా మాత్రం దాదాపు ఇదే విష‌యం వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే..  పూర్తిస్తాయిలో మాత్రం ఏ మీడియా సంస్థ కూడా.. ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌లేదు. కొంత అటు ఇటుగానే వెల్ల‌డించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: