- పయనీర్ పోల్ స్ట్రాటజీలో నిజమెంతా.?
- ఈ సర్వేని టిడిపి  నమ్ముతుందా.?


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు  రిజల్ట్ పైనే ఉత్కంఠ నెలకొని ఉంది.ఈ తరుణంలో  రకరకాల సర్వే సంస్థలు సర్వేలు చేసి వారి యొక్క రిజల్ట్ ను బయటపెడుతున్నారు. అలాంటి సర్వే సంస్థల్లో  చాలా ఫేమస్ అయిన ఓ సర్వే సంస్థ పయనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే. ఈ సంస్థ ఎన్నికల తర్వాత నిర్వహించినటు వంటి తన ఫైనల్ రిపోర్టును  బయట పెట్టింది. మరి ఈ రిపోర్టులో ఏ పార్టీకి  అనుకూలంగా ఉంది. ఏ పార్టీకి  ఎక్కువ సీట్లు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


 ఇప్పటి వరకు వాళ్లు ఎన్నో ప్రీపోల్ సర్వేలు ఇచ్చారు. కానీ ఎలక్షన్ తర్వాత చేసినటు వంటి ఈ సర్వే చాలా ఉత్కంఠగా మారింది. మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో  ఈసారి హోరాహోరి పోరు జరిగింది. ఏ సర్వే సంస్థ కూడా ఎవరు గెలుస్తారనేది క్లారిటీగా చెప్పడం లేదు. కానీ పయనీర్ సంస్థ వారు  175 నియోజకవర్గాల్లో 53 వేలకు పైగా శాంపిల్స్  సేకరించి వారి యొక్క సర్వేను చేశారు. ఇందులో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మంది మహిళలు పాల్గొన్నారని సర్వే సంస్థ వారు తెలియజేస్తున్నారు. అయితే ఈ సర్వే సంస్థ సైంటిఫిక్ గా  నియోజకవర్గాల వారీగా  చాలా క్లియర్ గా శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సర్వే సంస్థ ఎలక్షన్స్ కు ముందు  టిడిపి కూటమి 96 స్థానాల్లో గెలుస్తుందని, వైసిపి 36 స్థానాలకే పరిమితం అవుతుందని, 48 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని తెలియజేసింది.

 ఇక పార్లమెంటు విషయానికి వస్తే 15 టిడిపి కూటమి, 5 వైసిపి, 5 పోటాపోటీ ఉంటుందని తెలియజేసింది.  అయితే తాజాగా ఎన్నికల తర్వాత నిర్వహించిన సర్వేలో  126 ఎమ్మెల్యే స్థానాలను కచ్చితంగా టిడిపి కూటమి గెలుస్తుందని,వైసిపి 33 ఎమ్మెల్యేలను గెలవబోతుందని, కీన్ కాంటెస్ట్ లో 16 ఉంటాయని తెలియజేసింది.  ఇక ఎంపీల విషయానికి వస్తే.. టిడిపి కూటమి 20 ఎంపీ స్థానాలు గెలుస్తుందని, వైసిపి 5 ఎంపీ స్థానాలు గెలిచి కూటమి అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తోంది.  ఈ సర్వే ఇలా ఉంటే మరికొన్ని సర్వేలు మాత్రం పూర్తిగా వైసీపీ అధికారంలోకి రాబోతుందని  తెలియజేస్తున్నాయి. మరి ఈ సర్వే సంస్థ చెప్పింది నిజమవుతుందా లేదా తలకిందులు అవుతుందా అనేది జూన్ 4వ తేదీన బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: